రైల్వే సహాయమంత్రి సురేశ్‌ కన్నుమూత

కరోనావైరస్ సంక్రమణకు పాజిటివ్ పరీక్షించిన కరోనా కాటుకు రైల్వే సహాయ మంత్రి సురేష్ అంగడి బలయ్యారు. కరోనా సోకిన దాదాపు రెండు వారాల..

Update: 2020-09-24 02:12 GMT

కరోనా కాటుకు రైల్వే సహాయ మంత్రి సురేష్ అంగడి బలయ్యారు. కరోనా సోకిన దాదాపు రెండు వారాల తరువాత ఆయన మరణించారు. గత మూడు రోజులుగా ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడంతో ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరారు.. చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. COVID-19 సంక్రమణ కారణంగా మరణించిన మొదటి కేంద్ర మంత్రి అలాగే నాల్గవ ఎంపీ అయ్యారు. 1955 లో జన్మించిన ఆయన కర్ణాటకలోని బెల్గాం జిల్లాకు చెందినవారు.. తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో పార్టీలో పలు పదవులను నిర్వహించారు. 1996 లో బెల్గాంలో బిజెపి ఉపాధ్యక్షునిగా తన రాజకీయ జీవోతాన్ని ప్రారంభించారు.

2004, 2009 , 2014 , 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఎంపిగా ఎన్నికయ్యారు. గత ఏడాది సాధారణ ఎన్నికలలో నాలుగోసారి ఎన్నికవ్వడంతో ఆయనను కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రిగా చేసింది ఎన్డీఏ ప్రభుత్వం. రైల్వే శాఖ సహాయ మంత్రి సురేశ్‌ అంగడి ఆకస్మిక మృతిపై రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ , ప్రధాని నరేంద్ర మోడీ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఏపీ గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సంతాపం తెలిపారు.

Tags:    

Similar News