Union Health Ministry: కరోనా రోగులకు ఆ ఔషధం ఎంత మోతాదులో వినియోగించాలంటే..

Union Health Ministry: ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు యూకే సైంటిస్టులు కనిపెట్టిన ఔషధం డెక్సమెథసోన్.

Update: 2020-06-27 13:11 GMT

Union Health Ministry: ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు యూకే సైంటిస్టులు కనిపెట్టిన ఔషధం డెక్సమెథసోన్. ఈ స్టెరాయిడ్ ద్వారా మృత్యువుకు దగ్గరైన వారు కోలుకుంటున్నట్లు పరిశోధకులు వెల్లడించారు. కేవ‌లం క్లిష్ట‌మైన ప‌రిస్థితుల్లో ఉన్న రోగుల‌కు మాత్ర‌మే డెక్సామెథాసోన్ వాడాల‌ని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ స్ప‌ష్టం చేసింది. డెక్సమెథసోన్ వాడటం ద్వారా యూకేలో దాదాపు 5 వేల మంది కరోనా భారీ నుంచి కోలుకున్నారు. కరోనా వైరస్ చికిత్సలో మొదటి మెడిసిన్ అయిన డెక్సామెథాసోన్ వాడకాన్ని మంత్రిత్వ శాఖ అనుమతించింది. అత్యవసర సమయాల్లో డెక్సామెథాసోన్ వినియోగించవచ్చని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ మేరకు భారత ప్రభుత్వ ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ సవరించి కొత్త మార్గదర్శకాలతో ప్రకటన విడుదల చేసింది.

అందులో ముఖ్యంగా తీవ్రమైన కరోనా రోగులకు మిథైల్ ప్రెడ్నిసొలోన్ ప్రత్యామ్నాయంగా గ్లూకో కోర్టికో స్టెరాయిడ్ డెక్సామెథాసోన్ ను వాడొచ్చని పేర్కొంది. మోతాదు మిథైల్ ప్రెడ్నిసొలోన్ 1 - 2mg ఒకరోజుకు లేదా దాని స్థానంలో డెక్సామెథాసోన్ 0.2-0.4 mg ఒక రోజుకి మించకూడదని సూచించింది. గర్భిణీలకు వైద్యులు సూచన ప్రకారం మాత్రమే వాడాల్సి ఉంటుంది. ఇదిలావుంటే అతి తక్కువ, మధ్య స్థాయి కరోనా లక్షణాలు ఉన్న వారికి డెక్సమెథసోన్ పని చేయదని పరిశోధకులు వెల్లడించారు. అయితే..మృత్యువుతో పోరాడేవారికి మాత్రం మితంగా స్టెరయిడ్ డ్రగ్ ను ఇస్తే ఓ దివ్య ఔషధంగా ఉపయోగపడుతుందని యూకే పరిశోధకులు ఘంటా పదంగా చెబుతున్నారు.  

Tags:    

Similar News