Union Govt about Onion Exports: ఉల్లి ఎగుమతులపై నిషేధం.. ఉత్తర్వులు జరీ చేసిన కేంద్రం..

Union Govt about Onion Exports | దేశవ్యాప్తంగా ఉల్లి ధరలు పెరగడంతో కేంద్రం దిద్దుబాటు చర్యలు చేపట్టింది.

Update: 2020-09-15 01:45 GMT

Union Govt about Onion Exports | దేశవ్యాప్తంగా ఉల్లి ధరలు పెరగడంతో కేంద్రం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఉల్లి ఎగుమతులపై నిషేధం వవిధించింది. తాము చెప్పే వరకు ఉల్లి ఎగుమతులు నిలిపివేయాలని పేర్కొంది. తక్షణమే ఎగుమతి ఆంక్షలు అమల్లోకి వస్తాయని తెలిపింది. దేశీయంగా ఉల్లి శరాలు పెరగడంతో ఈ నిర్ణయం తీసులున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు కేంద్రం ఉత్తర్వులు జరీ చేసింది. దక్షిణాది రాష్ట్రాల్లో అధిక వర్షపాతం నమోదు కావడంతో పంటలపై తీవ్ర ప్రభావం పడిందని, దీని ఫలితంగా నెలలోనే ఉల్లిధర మూడు రెట్లు పెరిగినట్టు పేర్కొంది.

దక్షిణాసియాలో చాలా దేశాలు ముఖ్యంగా బంగ్లాదేశ్, నేపాల్, మలేషియా, శ్రీలంక వంటి దేశాలు ఉల్లి కోసం భారత్‌పైనే ఆధారపడతాయి. ఇక దేశంలోనే అతిపెద్ద ఉల్లిపాయల మార్కెట్ అయిన లాసల్‌గావ్‌లో నెల రోజుల వ్యవధిలో టన్ను ఉల్లిపాయల ధర మూడు రెట్లు పెరిగి ప్రస్తుతం రూ. 30 వేలుగా ఉంది. ఢిల్లీలో కిలో ఉల్లి ధర రూ. 40 పలుకుతోంది. ఈ నేపథ్యంలోనే దేశంలో ఉల్లి లభ్యతను పెంచేందుకు ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది. దక్షిణాది రాష్ట్రాల్లో అధిక వర్షపాతంతో వేసవిలో నాటిన ఉల్లి పంట దెబ్బతినడంతో పాటు మిగతా రాష్ట్రాల్లో కోత ఆలస్యమైందని ముంబయికి చెందిన ఉల్లి ఎగుమతిదారుల సంఘం అధ్యక్షుడు అజిత్ షా అన్నారు. 

Tags:    

Similar News