ఉల్లి ధరలపై కేంద్రం కీలక నిర్ణయం...

Update: 2019-09-29 11:31 GMT

ప్రస్తుతం ఉల్లి ధర ఘాటేక్కేతున్న సంగతి తెలిసిందే.. మార్కెట్ లో కిలో ఉల్లి ధర 60 రూపాయల నుండి 70 రూపాయలు పలుకుతుంది. భారీ వర్షాల కారణంగా దిగుబడి తగ్గిపోవడమే ఉల్లి ధరలు పెరగడానికి ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. అయితే ఉల్లి ధరలు సామాన్యు ప్రజలకి భారంగా మారడంతో దీనిపైన కేంద్రం రంగంలోకి దిగి ఉల్లి ఎగుమతులపై నిషేధం విధిస్తున్నట్టు వాణిజ్య శాఖ ప్రకటించింది. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని తెలిపింది. ఉల్లిపాయల ఎగుమతి విధానానికి సవరణలు చేస్తున్నట్టు విదేశీ వాణిజ్యం డైరెక్టర్ జనరల్ అలోక్ వర్దన్ చతుర్వేదీ పేరిట ఆదివారం నోటిఫికేషన్ జారీ చేశారు.మన దేశం నుంచి బంగ్లాదేశ్, శ్రీలంక, యూఏఈలకు ఉల్లి ప్రధానంగా ఎగుమతి అవుతుంది. ఈ ఏడాది తొలి నాలుగు నెలల్లో 154.5 మిలియన్ డాలర్ల విలువైన ఉల్లిని భారత్ ఎగుమతి చేసింది.

Tags:    

Similar News