PM Modi: నేడు ప్రధాని మోడీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ భేటీ
PM Modi: 9 ఏళ్లలో సాధించిన ప్రగతి, సంక్షేమంపై చర్చ
PM Modi: నేడు ప్రధాని మోడీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ భేటీ
PM Modi: నేడు మోడీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం కానుంది. 9 ఏళ్లలో సాధించిన ప్రగతి, సంక్షేమంపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ప్రభుత్వ పథకాల అమలు తీరుతెన్నులపై సమీక్ష చేయనున్నారు. గత తొమ్మిదేళ్లుగా బీజేపీ ప్రభుత్వం అమలు చేసిన పలు పథకాలను కేంద్ర మంత్రి మండలి సమావేశంలో ప్రధాని వివరించనున్నారు. క్షేత్రస్థాయిలో ప్రభుత్వ పథకాల అమలు తీరుతెన్నులపై పర్యవేక్షణ బాధ్యతలు చేపట్టాలని మోడీ సూచించనున్నారు. ప్రజలతో నేరుగా సంప్రదించి క్షేత్రస్థాయిలో పథకాల అమలులో ఉన్న లోటుపాట్లను సరిచేయాలని ప్రధాని మోడీ ఆదేశించనున్నారు. సార్వత్రిక ఎన్నికలకు సమాయత్తమయ్యేలా మంత్రి మండలి సహచరులకు ప్రధాని మోడీ సూచనలు చేయనున్నారు.