PM Modi: ప్రధాని మోడీ అధ్యక్షతన ఇవాళ కేంద్ర కేబినెట్ భేటీ

PM Modi: కేంద్ర మంత్రివర్గంలో మార్పులు చేర్పుల అంశంపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం

Update: 2023-07-03 04:09 GMT

PM Modi: ప్రధాని మోడీ అధ్యక్షతన ఇవాళ కేంద్ర కేబినెట్ భేటీ 

PM Modi: ప్రధాని మోడీ అధ్యక్షతన ఇవాళ కేంద్ర కేబినెట్ భేటీ కానుంది. ప్రగతి మైదాన్‌‌లో కొత్తగా నిర్మించిన కన్వెన్షన్ సెంటర్‌‌లో ఈ సమావేశం జరగనుంది. ఇవాళ సాయంత్రం 4గంటలకు జరగనున్న ఈ సమావేశానికి కేబినెట్ మంత్రులతో పాటు సహాయ మంత్రులు, స్వతంత్ర హోదా కలిగిన సహాయ మంత్రులు కూడా హాజరవుతున్నారు.

కేంద్ర మంత్రివర్గంలో మార్పులు చేర్పులు చోటుచేసుకుంటాయని కొన్నిరోజులుగా ప్రచారం జరుగుతుండడం, తాజాగా మహారాష్ట్ర రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈ భేటీ జరగనుండడం ప్రాధాన్యం సంతరించుకుంది. అజిత్ పవార్ తో చేతులు కలిపిన కేంద్ర మాజీ మంత్రి, ఎన్సీపీ నేత ప్రఫుల్ పటేల్ కు కేబినెట్ లో చోటు దక్కనుందని ప్రచారం జరుగుతోంది. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం, మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌‌ కూడా కేంద్ర మంత్రి వర్గంలోకి తీసుకుంటారని ఊహాగానాలు వెలువడుతున్నాయి.

భాగస్వామ్య పార్టీలకు కూడా క్యాబినెట్ మార్పులు, చేర్పుల్లో చోటు దక్కే అవకాశాలున్నాయన్న అంచనాలు ఉన్నాయి. త్వరలో తెలంగాణ, మిజోరం, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ అసెంబ్లీలకు ఈ యేడాది చివర్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ 5 రాష్ట్రాల్లో బీజేపీ నేతలు సమావేశాలు నిర్వహిస్తున్నారు. గెలుపే లక్ష్యంగా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నెలలో కనీసం 2 సార్లు రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు. దాంతో ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు కేంద్రమంత్రివర్గంలో అధిక ప్రాధాన్యత ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.

తెలంగాణ నుంచి ఇప్పటికే కేబినెట్‌ ర్యాంక్‌లో కిషన్‌రెడ్డి ఉండగా, అదనంగా మరొరకరికి సహాయ మంత్రి బెర్త్‌ ఇవ్వవచ్చనే ప్రచారం జరుగుతోంది. ఒకవేళ కిషన్‌రెడ్డికి రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగించినా సరే ఆయన్ని మంత్రివర్గంలో కంటిన్యూ చేయాలని పార్టీవర్గాలు భావిస్తున్నాయి. దాంతోపాటు లోక్‌సభ ఎంపీలుగా బండిసంజయ్‌, ధర్మపురి అరవింద్‌, రాజ్యసభ ఎంపీ డాక్టర్‌ లక్ష్మణ్‌ను కూడా పరిగణలోకి తీసుకోవచ్చని తెలుస్తోంది. 

Tags:    

Similar News