Union Cabinet Meeting: ప్రధాని మోడీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ భేటీ
Union Cabinet Meeting: ప్రధాని మోడీ అధ్యక్షతన ఇవాళ కేంద్ర కేబినెట్ సమావేశం జరగనున్నది.
Union Cabinet Meeting: ప్రధాని మోడీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ భేటీ
ప్రధాని మోడీ అధ్యక్షతన ఇవాళ కేంద్ర కేబినెట్ సమావేశం జరగనున్నది. ప్రధానంగా ఢిల్లీ బాంబు పేలుడు ఘటనపై చర్చించే అవకాశం ఉంది. భూటాన్ పర్యటనలో ప్రధాని మోడీ బాంబు బ్లాస్ట్ ఘటనపై స్పందించారు. ఘటన వెనుక ఉన్నఉగ్రవాద శక్తులను ఎట్టి పరిస్థితులోన్నూ వార్నింగ్ ఇచ్చారు. దేశ భద్రతను కించ పరిచే కుట్రదారులను చట్టం ముందు నిలబెడుతామన్నారు.
ఇప్పటికే ఢిల్లీ పేలుడు ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు ఏజెన్సీలు ఒక్కొక్క విషయాన్ని వెలికి తీస్తున్నాయి. ఇందుకు సంబంధించి ఢిల్లీ పోలీసు ఉన్నతాధికారులు ప్రాథమిక నివేదిక రెడీ చేశారు. కేంద్ర హోంశాఖకు సమర్పించారు. జైషే మహ్మద్ ఉగ్రసంస్థతో ఫరీదాబాద్ డాక్టర్ల సంబంధాలపై నివేదికలో పేర్కొన్నారు. ఈ నివేదికపై కేంద్ర కేబినెట్ సమావేశంలో చర్చించే ఛాన్స్ ఉంది. మరో వైపు జాతీయ దర్యాప్తు సంస్థ కేసును దర్యాప్తు జరుపుతోంది.