TOP 6 News @ 6PM: ఎంత ఆదాయం ఉన్న వారికి ఎంత టాక్స్ వర్తిస్తుంది?

Update: 2025-02-01 13:00 GMT

TOP 6 News @ 6PM: ఎంత ఆదాయం ఉన్న వారికి ఎంత టాక్స్ వర్తిస్తుంది? బడ్జెట్ తరువాత వచ్చే మార్పులు ఏంటి?

1) 12 లక్షల వార్షిక ఆదాయం వరకు నో ఇన్‌కమ్ ట్యాక్స్

కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ 2025-26 బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారు. 12 లక్షల వార్షిక ఆదాయం వరకు ఇన్‌కమ్ ట్యాక్స్ లేదంటూ గుడ్ న్యూస్ ప్రకటించారు. కేంద్రం వెల్లడించిన వివరాల ప్రకారం కొత్త ట్యాక్స్ పాలసీ ప్రకారంగా చూస్తే, రూ. 8-12 లక్షల ఆదాయంపై - 10% పన్ను, రూ. 12-16 లక్షల ఆదాయంపై - 15% పన్ను, రూ. 16-20 లక్షల ఆదాయంపై - 20% పన్ను, రూ. 20-25 లక్షల ఆదాయంపై - 25% పన్ను ,

రూ. 25 లక్షల ఆదాయంపై - 30% పన్ను వసూలు చేస్తారు. అయితే, ఈ స్లాబ్స్ ప్రకారం ఆదాయ పన్ను పరిమితిలోకి వచ్చే వారు ట్యాక్స్ డిడక్షన్ సోర్స్ కింద పన్ను మినహాయింపు పొందే అవకాశం ఉందని కేంద్రం వెల్లడించింది. బడ్జెట్‌కు సంబంధించిన మరిన్ని వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి. 

2) కేంద్ర బడ్జెట్ 2025 తరువాత ఏయే వస్తు సేవల ధరలు పెరగనున్నాయి, ఏయే వస్తు సేవల ధరలు తగ్గనున్నాయి?

Impacts of Union Budget 2025: భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కొత్త బడ్జెట్ ఎలా ఉంది? 2025-26 ఆర్థిక సంవత్సరానికి 50.65 లక్షల కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్‌తో ఆర్థిక మంత్రి ఎలాంటి సంకేతాలు ఇచ్చారు? దేశ ఆర్థిక ప్రగతిని వేగవంతం చేసే విధంగా, అన్ని వర్గాల ప్రజలకు అభివృద్ధి ప్రయోజనాలు అందే విధంగా ఈ బడ్జెట్‌ను రూపొందించామని నిర్మల పార్లమెంటులో చెప్పారు.

ముఖ్యంగా ఆదాయ పన్ను చెల్లించేవారికి ఈ బడ్జెట్‌లో కొంత రిలీఫ్ లభించింది. స్టాండర్డ్ డిడక్షన్‌తో కలిపి రూ. 12.75 లక్షల వార్షికాదాయం ఉన్న వారు ఇకపై ఎలాంటి ఆదాయ పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండదు. అలాగే, చిన్న-మధ్యతరహా పరిశ్రమలకు, తయారీ రంగానికి, గ్రామీణ అభివృద్ధికి చేయూతనిచ్చే విధంగా కేటాయింపులు ఉన్నాయి. పూర్తి వార్తా కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

3) Polavaram Project: పోలవరం రూ.30,436 కోట్ల సవరణ అంచనాలకు కేంద్రం ఆమోదం

Polavaram Project: పోలవరం ప్రాజెక్టు సవరించిన వ్యయం రూ.30, 436. 95 కోట్లకు కేంద్రం ఆమోదం తెలిపింది. 2025-26 బడ్జెట్ ను కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు. ఈ బడ్జెట్ లో ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. పోలవరం బ్యాలెన్స్ గ్రాంట్ రూ. 12, 157. 53 కోట్లుగా కేంద్రం తెలిపింది. 2025-26 బడ్జెట్ లో రూ. 12,157.53 కోట్లను కేంద్రం కేటాయించింది.

గత ఏడాది బడ్జెట్ లో కూడా పోలవరం ప్రాజెక్టుకు రూ.12 వేల కోట్లు కేటాయించింది. ఈ ప్రాజెక్టును2028 నాటికి పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. గత బడ్జెట్ లో అమరావతిలో రాజధాని నిర్మాణ పనులకు రూ. 15 వేల కోట్లు కేటాయించారు. ఈ నిధులను అప్పుల రూపంలో ఇప్పించనుంది కేంద్రం. ఈ రుణాలు ఇచ్చే సంస్థలకు కేంద్రం గ్యారంటీ ఇస్తోంది.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించిన తర్వాత పోలవరం, అమరావతిలో రాజధాని నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. పోలవరం ప్రాజెక్టు పనులపై అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. పోలవరం నిర్మాణ బాధ్యతను కేంద్రం తీసుకొంది. ఇప్పటివరకు ప్రాజెక్టు కోసం చేసిన ఖర్చుకు సంబంధించిన నిధులను విడుదల చేయాలని కేంద్రాన్ని రాష్ట్రం కోరింది. దావోస్ నుంచి తిరిగి వచ్చిన సమయంలో రాష్ట్రానికి సంబంధించి బడ్జెట్ లో కేటాయింపుల గురించి చంద్రబాబు కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ తో చర్చించారు.

4) కేంద్రం నుండి తెలంగాణ ఆశించిందేంటి? వచ్చిందేంటి?

తెలంగాణలో రీజినల్ రింగ్ రోడ్డు, మూసీ పునరుజ్జీవం, హైదరాబాద్ మెట్రో రెండో ఫేజ్ వంటి ప్రాజెక్టులకు రూ.1,632 కోట్లు ఇవ్వాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. రాష్ట్ర ప్రభుత్వం కోరిన నిధుల విషయంలో బడ్జెట్లో నిధులు కేటాయింపులు లేవు. అయితే ఇతర ప్రాజెక్టులు జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ , రోడ్లు వంతెనల నిర్మాణం వంటి పథకాలకు కేంద్రం నిధులు కేటాయించింది. బడ్జెట్‌లో తెలంగాణకు సరిగా కేటాయింపులు లేవని కాంగ్రెస్ విమర్శలు చేస్తోంది. బడ్జెట్ లో తెలంగాణకు సున్నా ఇచ్చారని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ విమర్శించారు. బడ్జెట్ లో తెలంగాణకు అన్యాయం చేశారని ఆయన ఆరోపించారు.

5) Union Budget 2025: కేంద్ర బడ్జెట్.. బీహార్ కు వరాలు

Union Budget 2025: కేంద్ర ప్రభుత్వం తన 2025-26 బడ్జెట్ లో బీహర్ రాష్ట్రానికి నిధుల కేటాయించింది ప్రభుత్వం. త్వరలోనే బీహార్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. దీంతో బీహార్ రాష్ట్రంపై కేంద్రం ఫోకస్ పెట్టింది.

బీహార్ లో ఏర్పాటు చేయనున్న సంస్థలు నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ సెంటర్ మఖానా బోర్డు ఐదు ఐఐటీలలో మౌలిక వసతులు కల్పిస్తారు. ఐఐటీ పాట్నా సెంటర్ ను విస్తరించనున్నారు. బీహార్ లోని మిథిలాంచల్ లో 50 వేల హెక్టార్లకు చేకూర్చే వెస్టర్న్ కోసి కెనాల్ కు ఆర్ధిక సాయం బీహార్ లో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టు ఏర్పాటు. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. 

6) ఎన్‌కౌంటర్‌లో 8 మంది మావోయిస్టులు మృతి... ఈ నెల రోజుల్లోనే 48 మంది మృతి

ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా అడవుల్లో శనివారం మరోసారి ఎన్‌కౌంటర్ జరిగింది. గంగలూరు సమీపంలో జరిగిన ఈ ఎదురుకాల్పుల్లో 8 మంది మావోయిస్టులు మృతి చెందారు. డిస్ట్రిక్ రిజర్వ్ గార్డ్, స్పెషల్ టాస్క్‌ఫోర్స్, సీఆర్పీఎఫ్ కు చెందిన 222 బెటాలియన్, కోబ్రా బలగాలకు చెందిన 202 బెటాలియన్ బలగాలు జాయింట్ కూంబింగ్ ఆపరేషన్ లో పాల్గొన్నారు. ఈ ఎన్‌కౌంటర్ వార్త నిజమేనని బస్తర్ రేంజ్ ఐజి సుందర్ రాజ్ ధృవీకరించారు. జనవరి 1వ తేదీ నుండి ఇప్పటివరకు జరిగిన అన్ని ఎన్ కౌంటర్లలో కలిపి మొత్తం 48 మంది మావోయిస్టులు చనిపోయారు. 2026 మార్చి నాటికి లెఫ్ట్ వింగ్ భావజాలం ఉన్న వారిని ఏరిపారేస్తామని గతంలోనే కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటించిన విషయం తెలిసిందే.

Tags:    

Similar News