Budget 2025: ఏ వస్తువుల ధరలు తగ్గుతాయి? ఏవి పెరుగుతాయి?

Update: 2025-02-01 12:55 GMT

Impacts of Union Budget 2025: భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కొత్త బడ్జెట్ ఎలా ఉంది? 2025-26 ఆర్థిక సంవత్సరానికి 50.65 లక్షల కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్‌తో ఆర్థిక మంత్రి ఎలాంటి సంకేతాలు ఇచ్చారు? దేశ ఆర్థిక ప్రగతిని వేగవంతం చేసే విధంగా, అన్ని వర్గాల ప్రజలకు అభివృద్ధి ప్రయోజనాలు అందే విధంగా ఈ బడ్జెట్‌ను రూపొందించామని నిర్మల పార్లమెంటులో చెప్పారు.

ముఖ్యంగా ఆదాయ పన్ను చెల్లించేవారికి ఈ బడ్జెట్‌లో కొంత రిలీఫ్ లభించింది. స్టాండర్డ్ డిడక్షన్‌తో కలిపి రూ. 12.75 లక్షల వార్షికాదాయం ఉన్న వారు ఇకపై ఎలాంటి ఆదాయ పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండదు. అలాగే, చిన్న-మధ్యతరహా పరిశ్రమలకు, తయారీ రంగానికి, గ్రామీణ అభివృద్ధికి చేయూతనిచ్చే విధంగా కేటాయింపులు ఉన్నాయి.

వేటి ధరలు తగ్గుతాయి:

1. మెడిసిన్స్: కస్టమ్స్ సుంకాలలో మార్పులు చేయడం వల్ల క్యాన్సర్ తదితర ప్రాణాంతక వ్యాధులకు వాడే మందుల ధరలు తగ్గుతాయి. ప్రాథమిక కస్టమ్స్ డ్యూటీ నుంచి ఈ తరహా మందులను మినహాయించారు.

2. ఎలక్ట్రానిక్ వస్తువులు: సెల్స్, ఇతర కంపోనెంట్స్ మీద సుంకం 5 శాతానికి తగ్గించడం వల్ల ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల రేట్లు తగ్గుతాయి. ఎల్ఈడీ, ఎల్‌సీడీ టీవీల ధరలు తగ్గుతాయి.

3. ఈవీ, మొబైల్ బ్యాటరీల తయారీని క్యాపిటల్ గుడ్స్ మినహాయింపుల జాబితాలో చేర్చారు కాబట్టి వాటి ధరలు తగ్గుతాయి.

4. ఫ్రోజెన్ ఫిష్ పేస్ట్ (సురిమి) మీద కస్టమ్స్ డ్యూటీ 30 నుంచి 5 శాతానికి తగ్గింది.

5. మెరీన్ ఉత్పత్తులు

6. క్యారియర్ గ్రేడ్ ఇథర్నెట్ స్విచ్చులు

7. వైద్య పరికరాలు

8. కోబాల్ట్, జింక్ ఉత్పత్తులు

వేటి ధరలు పెరుగుతాయి:

1. ఇంటరాక్టివ్ ఫ్లాట్ పానెల్స్ డిస్ ప్లే ఉత్పత్తుల ధరలు పెరుగుతాయి

2. అల్లిక దుస్తులు

3. టెలికామ్ ఎక్విప్మెంట్, ప్లాస్టిక్ ఉత్పత్తులు

2024-25 ఆర్థిక సర్వే భారత జీడీపీ వృద్ధి రేటు 6.3 నుంచి 6.8 శాతం మధ్య ఉంటుందని అంచనా వేసింది. ఈ అంచనాలను అందూకోవడానికి ఈ బడ్జెట్లో తయారీ రంగాలను పన్ను మినహాయింపులతో ప్రోత్సహించారు. మధ్యతరగతి చేతుల్లో డబ్బు ఖర్చులకు డబ్బు ఆడడానికి పన్నులు తగ్గించారు. అలాగే, దీర్ఘకాలిక పొదుపు పథకాలను ప్రోత్సహించే చర్యలు చేపట్టారు. ముఖ్యంగా, రీసర్చ్ అండ్ డెవలప్మెంట్, ఎంఎస్ఎంఈల మీద ఈ బడ్జెట్ ఫోకస్ పెట్టింది. 

Tags:    

Similar News