కాల్పుల విరమణ ఉల్లంఘన.. అమరవీరులైన ఇద్దరు జవాన్లు

కుక్కతోక వంకర పాకిస్థాన్ బుద్ధి రెండూ మారవు అన్నట్టు .. నియంత్రణ రేఖ వెంబడి కాల్పుల విరమణ ఒప్పందం అమల్లో ఉన్నా.. పలుమార్లు రెచ్చగొడుతూనే ఉన్నాయి.

Update: 2020-05-02 10:09 GMT

కుక్కతోక వంకర పాకిస్థాన్ బుద్ధి రెండూ మారవు అన్నట్టు .. నియంత్రణ రేఖ వెంబడి కాల్పుల విరమణ ఒప్పందం అమల్లో ఉన్నా.. పలుమార్లు రెచ్చగొడుతూనే ఉన్నాయి పాక్ దళాలు.. కాశ్మీర్‌లోని యురి సెక్టార్‌లో నియంత్రణ రేఖపై కాల్పుల విరమణను ఉల్లంఘిస్తూ పాకిస్తాన్ సైన్యం శుక్రవారం భారీ కాల్పులు జరిపింది. ఇద్దరు బాలికలు సహా పలువురు గాయపడ్డారు. ఇద్దరు జవాన్లు చికిత్స సమయంలో మరణించారు.

మరోవైపు ఇద్దరు బాలికలను శంజా బానో, థైరా బానోగా గుర్తించారు. గాయపడిన ఓ యువకుడి పరిస్థితి స్థిరంగా ఉందని వైద్యులు వెల్లడించారు. శుక్రవారం మధ్యాహ్నం 3.30 గంటలకు బారాముల్లాలోని రాంపూర్ ప్రాంతంలో పాకిస్తాన్ దళాలు కాల్పులు మొదలు పెట్టాయని, ఫార్వర్డ్ పోస్టులు, పౌర ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్నాయని వర్గాలు తెలిపాయి. దీంతో భారత దళాలు వారిపై ప్రతీకారం తీర్చుకున్నాయి.. ఇద్దరి మధ్య గంటకు పైగా కాల్పులు జరిగినట్టు తెలుస్తోంది. కాగా ఏప్రిల్ 27 న కూడా ఉరి సెక్టార్‌లో కాల్పులు జరిగాయి. అయితే, అప్పుడు భారత్‌కు ఎలాంటి నష్టం జరగలేదు.


Tags:    

Similar News