ప్రపంచవ్యాప్తంగా కోవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో జపాన్‌లోని యెకోహోమా తీరంలో నిలిపివేసిన 'డైమండ్ ప్రిన్సెస్' క్రూయీజ్ ప్రయాణికులందరికీ ఆ దేశ ప్రభుత్వం ఐఫోన్లను ఉచితంగా పంపిణీ చేసింది. కోవిడ్ లక్షణాలకు సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఎప్పటికప్పుడు వైద్యాధికారులతో టచ్‌లో ఉండేందుకు అత్యాధునిక ఫోన్లను వారికి అందించినట్లు పేర్కొంది. డైమండ్ ప్రిన్సెస్ నౌకలో ప్రయాణికులు, సిబ్బంది కలిపి మొత్తం 3,700 మంది ఉన్నారు. వీరిలో దాదాపు కోవిడ్ సోకిన వారి సంఖ్య 454కి చేరినట్లు వార్తలు వెలువడటంతో.. నౌకలో ఉన్న ప్రయాణికుల ఆరోగ్య పరిస్థితిపై సర్వత్రా ఆందోళన నెలకొంది.మరోవైపు తాజాగా మరో ఇద్దరు ఇండియన్లకు కోవిడ్ 19 సోకడంతో ఇప్పటి వరకూ వైరస్ సోకిన ఇండియన్ల సంఖ్య ఆరుకు చేరుకుంది.