ఛత్తీస్‌గఢ్ నారాయణపూర్ జిల్లాలో ఎన్‌కౌంటర్.. ఇద్దరు మావోయిస్టులు మృతి
Chhattisgarh: ఛత్తీస్‌గఢ్ నారాయణపూర్ జిల్లాలో ఎన్‌కౌంటర్ జరిగింది. అబూజ్‌మడ్ అడవుల్లో మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య భీకర కాల్పులు కొనసాగుతున్నాయి.
Chhattisgarh: ఛత్తీస్‌గఢ్ నారాయణపూర్ జిల్లాలో ఎన్‌కౌంటర్ జరిగింది. అబూజ్‌మడ్ అడవుల్లో మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య భీకర కాల్పులు కొనసాగుతున్నాయి. ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందినట్టు తెలుస్తోంది. ఘటనాస్థలంలో భారీగా ఆయుధాలతో పాటు.. ఇద్దరి మావోయిస్టుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నాయి భద్రతా దళాలు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు సమాచారం. అబూజ్‌మడ్ అడువుల్లో ఎన్‌కౌంటర్‌ను జిల్లా ఎస్పీ కూడా ధ్రువీకరించినట్టు తెలుస్తోంది.