Chhattisgarh: జవాన్ల కోసం పెట్టిన ఐఈడీ పేలి ఇద్దరు చిన్నారుల మృతి
Chhattisgarh: ఆడుకుంటూ పొరపాటున ఐఈడీ బాంబులను తాకిన చిన్నారులు
Chhattisgarh: జవాన్ల కోసం పెట్టిన ఐఈడీ పేలి ఇద్దరు చిన్నారుల మృతి
Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపుర్ జిల్లాలో భద్రతా బలగాలే టార్గెట్‌గా చేసుకుని మావోయిస్టులు పెట్టిన ఐఈడీ బాంబు పేలి ఇద్దరు బాలురు మృతి చెందారు. బైరామ్‌గఢ్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఇంద్రావతి నది ఒడ్డునున్న బేడంగా గ్రామ సమీప పొలాల్లో ఈ ఘటన జరిగింది. ఇద్దరు చిన్నారులు ఆడుకుంటూ పొరపాటున అక్కడ ఉన్న ఐఈడీ బాంబులను తాకారు. దీంతో ఒక్కసారిగా పేలుడు సంభవించి.. వారిద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు.
పేలుడు శబ్దానికి గ్రామస్థులు భయాందోళనకు గురయ్యారు. ఘటనా స్థలానికి చేరుకుని వెళ్లి చూడగా ఇద్దరు చిన్నారులు విగతజీవులై కనిపించడంతో వారి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. మృతదేహాలను తీసుకొని గ్రామస్థులందరూ మూకుమ్మడిగా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లారు. ఘటనను బీజాపుర్ ఎస్పీ ధ్రువీకరించారు. భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకొని మావోయిస్టులు కొద్ది రోజుల కిందట పొలాల్లో ఐఈడీ బాంబులను అమర్చినట్లు పోలీసులు భావిస్తున్నారు.