Twitter: భారత్‌లో గ్రీవెన్స్ అధికారి ని నియమించిన ట్విటర్

Twitter: భారత రెసిడెంట్ గ్రీవెన్స్ అధికారిగా వినయ్ ప్రకాష్‌ను నియమిస్తున్నట్లు ట్విటర్ తెలిపింది.

Update: 2021-07-11 07:17 GMT

భారత్‌లో గ్రీవెన్స్ అధికారి ని నియమించిన ట్విటర్

Twitter: మొత్తానికి ముందు తల ఎగరేసి ఇప్పుడు దారికొచ్చిన ట్విటర్ ... ప్రభుత్వ కొత్త ఐటీ చట్టానికి అనుగుణంగా చర్యలు చేపట్టింది. మొన్నటివరకు మేం ప్రపంచమంతా ఉన్నాం.. ఇండియాలో ఏంటిది అన్నట్లు మాట్లాడిన ట్విటర్.. ఇప్పుడు వివాదాలకు తావు లేకుండా.. ఏదొచ్చినా వెంటనే సెటిల్ అయిపోయేలా గ్రీవెన్స్ అధికారిని నియమించింది. ఈ పని చేయమని గతంలో కేంద్ర ప్రభుత్వం చెప్పినా మొండికేసిన ట్విటర్ చివరకు ఆ పని పూర్తి చేసింది.

భారత్‌లో గ్రీవెన్స్ అధికారిని నియమించింది. భారత రెసిడెంట్ గ్రీవెన్స్ అధికారిగా వినయ్ ప్రకాష్‌ను నియమిస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. రెసిడెంట్ గ్రీవెన్స్ అధికారి ప్రధాన కార్యాలయాన్ని బెంగళూరులో ఏర్పాటు చేసినట్లు పేర్కొంది. ట్విటర్ యూజర్ల కోసం ఆ కార్యాలయం అడ్రస్‌ను ప్రకటించింది. బెంగళూరు డిక్సన్ రోడ్‌లోని ది ఎస్టేట్ ప్రధాన కేంద్రంగా వినయ్ ప్రకాష్ తన కార్యకలాపాలను కొనసాగిస్తారని తెలిపింది.

కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా కొన్ని మార్గదర్శకాలను రూపొందించిన 26వ తేదీ నుంచి అమల్లోకి వచ్చాయి. వాట్సప్, ఫేస్‌బుక్ వాటిని అనుసరిస్తోన్నాయి. కొత్త మార్గదర్శకాలకు లోబడి కార్యకలాపాలను కొనసాగిస్తామని ప్రకటించాయి. ట్విటర్ మాత్రం విభేదించింది. ఈ నేపథ్యంలో- కొత్త మార్గదర్శకాలను అనుసరించడంపై ఆ మంత్రిత్వ శాఖ ట్విటర్ యాజమాన్యానికి తుది నోటీసులను జారీ చేసింది. ఐటీ చట్టం 2000లోని సెక్షన్ 79 కింద చివరి అవకాశాన్ని ఇస్తోన్నామని కేంద్రం తెలిపింది.

ఈ నిబంధనల ప్రకారం- ట్విట్టర్ యాజమాన్యం భారత్‌లో ఒక చీఫ్ కంప్లయన్సెస్ అధికారి, ఒక నోడల్ అధికారి, ఫిర్యాదులను స్వీకరించడానికి ప్రత్యేకంగా మరో గ్రీవెన్స్ అధికారిని వేర్వేరుగా నియమించాల్సి ఉంటుంది. ఇప్పటిదాకా ఇటాంటి చర్యలేవీ ట్విట్టర్ యాజమాన్యం చేపట్టలేదు. కేంద్ర ప్రభుత్వం తాఖీదులను జారీ చేయడంతో మెట్టు దిగింది. తన కార్యకలాపాలను సక్రమంగా నిర్వర్తించేందుకు ముందుకు వచ్చిందిట్విటర్.

Tags:    

Similar News