బీజేపీకి 30 స్థానాలకు కూడా గెలవదు - మమతా బెనర్జీ

ఎన్నికలకు ఆరు నెలల ముందు నుంచే బెంగాల్ రాజకీయం హీట్ పుట్టిస్తోంది.

Update: 2020-12-29 15:52 GMT

ఎన్నికలకు ఆరు నెలల ముందు నుంచే బెంగాల్ రాజకీయం హీట్ పుట్టిస్తోంది. బీజేపీ, టీఎంసీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ మధ్య బెంగాల్‌లో పర్యటించిన అమిత్ షా.. 2వందలకు పైగా స్థానాల్లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో టీఎంసీ పని అయిపోయినట్టే అని అన్నారు. ఐతే అమిత్ షా వ్యాఖ్యలకు టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ కౌంటర్ ఇచ్చారు. బీజేపీకి అంత సీన్ లేదని సెటైర్లు వేశారు.

బెంగాల్‌లో కమలవికాసం జరిగే పని కాదని మమత అన్నారు. 30 సీట్లకు మించి గెలిచేంత సీన్ బీజేపీకి లేదని జోస్యం చెప్పారు. బెంగాల్‌ను అన్ని విధాలా అభివృద్ది చేశామని... తాము అందించిన పాలన వల్ల ప్రజలంతా తమవైపే ఉంటారని అన్నారు. రాష్ట్ర అభివృద్ధి విషయంలో తాము రాజీపడే ప్రసక్తే లేదని చెప్పారు. బెంగాల్‌లోకి బీజేపీని అనుమతించబోమని అన్నారు. కొందరు నాయకులు వెళ్లిపోయినంత మాత్రాన తమ పార్టీకి వచ్చే నష్టం ఏమీ లేదని దీదీ తెలిపారు.


Tags:    

Similar News