షిర్డీ ఆలయం మూసివేత వార్తలు అవాస్తవం : ట్రస్ట్‌ పీఆర్వో

Update: 2020-01-18 05:41 GMT
షిర్డీ ఆలయం

మహారాష్ట్ర సర్కార్‌ ప్రకటనకు నిరసనగా షిర్డీ ఆలయం మూసివేస్తున్నారన్న వార్తలు అవాస్తవమని ఆలయ ట్రస్ట్‌ స్పష్టం చేసింది. గ్రామస్తులు ప్రకటించిన బంద్‌తో ట్రస్ట్‌కు సంబంధం లేదని తెలిపింది. భక్తులు ఆందోళనకు గురికావద్దని షిర్డీ ఆలయం, భక్తి నివాస్‌లో సేవలు యథావిధిగా కొనసాగుతాయన్నారు. సాయంత్రం షిర్డీ గ్రామస్తులతో సమావేశమవుతామని సాయిబాబా సంస్థాన్‌ ట్రస్ట్‌ పీఆర్‌వో తెలిపారు.

సాయిబాబా జన్మస్థలమైన పత్రిని వంద కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసేందుకు ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం నిర్ణయించిందన్న వార్తలు షిరిడీ గ్రామంలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ నిర్ణయాన్ని షిరిడీ ఆలయ ట్రస్టు తీవ్రస్థాయిలో వ్యతిరేకిస్తోంది. పత్రిలో బాబా పుట్టినట్టు ఎలాంటి ఆధారాలు లేవని ప్రభుత్వం అలా ఎలా నిర్ణయం తీసుకుంటుందని ప్రశ్నించింది. ప్రభుత్వం నిర్ణయం పూర్తిస్థాయిలో రావలసి ఉందని అప్పుడు తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని ట్రస్ట్ తెలిపింది.

ఇది చదవండి 

సాయిబాబా భక్తులకు షాక్.. రేపటి నుండి షిరిడి ఆలయం మూసివేత

Tags:    

Similar News