Train Accident: పశ్చిమ బెంగాల్‌లో ఘోర ప్రమాదం.. రైలు ఢీకొని 3 ఏనుగులు మృతి
Train Accident: ఒక పిల్ల ఏనుగు, రెండు పెద్ద ఏనుగులు మృతి
Train Accident: పశ్చిమ బెంగాల్‌లో ఘోర ప్రమాదం.. రైలు ఢీకొని 3 ఏనుగులు మృతి
Train Accident: పశ్చిమ బెంగాల్‌లోని బక్సా టైగర్ రిజర్వ్ అటవీప్రాంతంలో పార్శిల్ రైలు ఢీకొన్న ప్రమాదంలో మూడు ఏనుగులు చనిపోయాయి. రాజభట్‌ఖావా, కాల్చిని రైల్వే స్టేషన్‌ల మధ్య శిఖరి గేట్ సమీపంలో సంఘటన జరిగింది. పార్శిల్ రైలు ఢీకొనడంతో ఒక పిల్ల ఏనుగు, రెండు పెద్ద ఏనుగులు మృతి చెందాయి. రైలు కింద ఉన్న మూడు ఏనుగులలో ఒకదాని శరీరంపై అనేక కోత గుర్తులు ఉన్నాయి. భారతదేశంలో ప్రతి సంవత్సరం సగటున 20 ఏనుగులు రైలు ఢీకొనడం వల్ల మరణిస్తున్నాయని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి.