యూపీలో ఘోర రైలు ప్రమాదం.. పట్టాలు దాటుతున్న యాత్రికులను ఢీకొన్న రైలు
ఉత్తరప్రదేశ్‌లో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. పట్టాలు దాటుతున్న యాత్రికులను రైలు ఢీ కొట్టింది.
ఉత్తరప్రదేశ్‌లో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. పట్టాలు దాటుతున్న యాత్రికులను రైలు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడగా.. వారిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మీర్జాపూర్‌లోని చునార్ రైల్వేస్టేషన్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. చోపన్ - ప్రయాగ్‌రాజ్ ఎక్స్‌ప్రెస్ చునార్ రైల్వేస్టేషన్ ప్లాట్‌ఫామ్ 4 వద్ద వచ్చి ఆగింది.
అందులో నుంచి ప్రయాణికులు దిగి.. ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కాకుండా.. పట్టాలు దాటేందుకు ప్రయత్నించారు. అదే సమయంలో ఎదురుగా వస్తున్న నేతాజీ ఎక్స్‌ప్రెస్ వారిని ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అప్రమత్తమైన రైల్వే సిబ్బంది వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు రైల్వే పోలీసులు.