ఛత్తీస్‌గఢ్‌లో ఘోర రైలు ప్రమాదం.. ప్యాసింజర్‌ రైలును ఢీకొట్టిన గూడ్స్‌ రైలు

ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని బిలాస్‌పూర్ జిల్లాలో మంగళవారం సాయంత్రం ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది.

Update: 2025-11-04 11:41 GMT

ఛత్తీస్‌గఢ్‌లో ఘోర రైలు ప్రమాదం.. ప్యాసింజర్‌ రైలును ఢీకొట్టిన గూడ్స్‌ రైలు

ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని బిలాస్‌పూర్ జిల్లాలో మంగళవారం సాయంత్రం ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. ప్యాసింజర్ రైలును గూడ్స్ రైలు వెనుక నుండి బలంగా ఢీకొట్టింది.

ఈ దుర్ఘటనలో ఇప్పటివరకు ఆరుగురు ప్రయాణికులు మృతి చెందినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది అని అధికారులు తెలిపారు. ప్రమాద స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. రైల్వే అధికారులు మరియు స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.

Tags:    

Similar News