Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌ జిల్లాలో విషాదం.. నర్మదా నదిలో పడి నలుగురు గల్లంతు

Madhya Pradesh: నిన్న సాయత్రం చేపలవేటకు వెళ్లి నదిలో చిక్కుకున్న యువకులు

Update: 2023-07-10 09:35 GMT

Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌ జిల్లాలో విషాదం.. నర్మదా నదిలో పడి నలుగురు గల్లంతు

Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో విషాదం చోటు చేసుకుంది. నిన్న సాయంత్రం చేపలవేటకు వెళ్లి నర్మద నదిలో గంటల తరబడి చిక్కుకుపోయిన నలుగురు యువకులను ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు సురక్షితంగా బయటకు తీశారు. వారిని కాపాడేందుకు హోంగార్డు, ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు రాత్రంతా సహాయక చర్యలు చేపట్టాయి. నీటి ప్రవాహం కారణంగా వారిని రక్షించేందుకు బృందాలు నానా తంటాలు పడాల్సి వచ్చింది. యువకులను సంతోష్, మనీష్, శుభం, అమిత్‌లుగా గుర్తించారు.

రాత్రిపూట రెస్క్యూ ఆపరేషన్ సమయంలో వారిని తాడు సహాయంతో బయటకు తీశారు. కాగా నలుగురు యువకులు నిన్న సాయంత్రం 4 గంటలకు వేటకోసం భేదాఘాట్‌లోని గోపాల్‌పూర్‌కు చేరుకున్నారు. కొద్దిసేపటికే నీటి ప్రవాహం పెరిగి దీవిలోనే చిక్కుకుపోయారు. నది ప్రవాహానికి యువకులు చిక్కుకుపోయారన్న వార్త అధికార యంత్రాంగంలో కలకలం రేపింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. తొలుత గ్రామస్తులు తమ స్థాయిలో యువకులను కాపాడేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది.

Tags:    

Similar News