ఢిల్లీలో రైతు సంఘాల భారీ ట్రాక్టర్ ర్యాలీ

* కిసాన్ గణతంత్ర పరేడ్ పేరిట ర్యాలీ * ఢిల్లీ సరిహద్దుల్లో భారీగా పోలీసుల మోహరింపు * ఆరువేల మంది సిబ్బందితో భద్రతా పర్యవేక్షణ * 5వేల ట్రాక్టర్లకే అనుమతి

Update: 2021-01-26 03:01 GMT

farmers tractor rally (file Image)

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాలను రద్దు చేయాలని ఇవాళ ఢిల్లీ సరిహద్దులో కిసాన్ గణతంత్ర పరేడ్ పేరిట రైతులు భారీ ట్రాక్టర్స్ ర్యాలీ నిర్వహిస్తున్నారు. దీంతో దేశ రాజధాని ఆంక్షల వలయంలోకి వెళ్లింది. ఓ వైపు గణతంత్ర దినోత్సవ వేడుకలు, మరోవైపు ట్రాక్టర్ ర్యాలీ ఉండటంతో పోలీసులు అప్రమతయ్యారు. రైతుల ర్యాలీకి 37 షరతులతో కూడిన అనుమతి ఇచ్చారు. పోలీసులు సూచించిన మార్గాల్లోనే ట్రాక్టర్ల ర్యాలీని నిర్వహించాలని సూచించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు చోటు లేకుండా పోలీసులు భారీబందోబస్తు ఏర్పాటు చేశారు.

మరోవైపు సాగుచట్టాలను రద్దు చేసే వరకు తమ పోరాటం ఆగదని రైతు సంఘాలు ప్రకటించాయి. అంతేకాదు రిపబ్లిక్ వేడుకలు ముగిసిన తర్వాతే ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహించాలని పోలీసులు సూచించారు. మూడు మార్గాల్లోనే ర్యాలీకి అనుమతి ఇచ్చారు. రైతులు ట్రాక్టర్ల ర్యాలీని ప్రశాంతంగా జరపాలని పోలీసులు సూచించారు. 5వేల మందికి మాత్రమే పోలీసులు అనుమతి ఇచ్చారు. కానీ, రైతులు మాత్రం రెండు లక్షల ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహిస్తామని ప్రకటించారు. దాంతో భారీ బందోబస్తు అందుబాటులో ఉంచారు. ప్రజా రవాణాకు, ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించకుండా రోడ్డుకు ఓ పక్కగా ట్రాక్టర్స్ వెళ్లాలని పోలీసులు సూచించారు. ట్రాక్టర్లకు జెండాలు కట్టేందుకు కట్టేలు మాత్రమే వాడాలని తెలిపారు. 

Tags:    

Similar News