Viral News: 'నన్ను తాకితే 35 ముక్కలుగా నరుకుతా'..తొలిరాత్రే భర్తకు నవవధువు షాక్!

Viral News: ఉత్తరప్రదేశ్‌లో ఇటీవల వెలుగులోకి వచ్చిన ఓ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ నవ వధువు తన మొదటి రాత్రి గదిలోకి కత్తి తీసుకెళ్లి భర్తను చంపేస్తానంటూ బెదిరించి కలకలం సృష్టించింది.

Update: 2025-06-25 04:35 GMT

నన్ను తాకితే 35 ముక్కలు చేస్తా!’ – తొలిరాత్రే భర్తకు భార్య బెదిరింపు

Viral News: ఉత్తరప్రదేశ్‌లో ఇటీవల వెలుగులోకి వచ్చిన ఓ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ నవ వధువు తన మొదటి రాత్రి గదిలోకి కత్తి తీసుకెళ్లి భర్తను చంపేస్తానంటూ బెదిరించి కలకలం సృష్టించింది.

ప్రయాగ్‌రాజ్‌కు చెందిన నిషాద్ అనే యువకుడికి ఇటీవల సితార అనే అమ్మాయితో పెళ్లయింది. పెళ్లి సమయంలో ఎంతో సంతోషంగా కనిపించిన వధువు, మొదటి రాత్రి వింతగా ప్రవర్తించింది. గదిలోకి కత్తి తీసుకువచ్చి "నన్ను తాకితే 35 ముక్కలు చేస్తా" అంటూ బెదిరించింది. తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని, తాను అమన్ అనే యువకుడిని ప్రేమిస్తున్నానని చెప్పింది. ఈ విషయం బయటపెడితే తప్పుడు కేసు పెడతానని భర్తను, అతడి కుటుంబసభ్యులను బెదిరించింది.

దీంతో మరుసటి రోజు ఇరు కుటుంబాలు గ్రామ పంచాయతీ పెట్టించారు. సితార తల్లిదండ్రులు ఆమెకు నచ్చజెప్పడంతో, నిషాద్ ఆమెను ఇంటికి తీసుకువచ్చాడు. అయినప్పటికీ ఆమె వేధింపులు ఆగలేదు. దీంతో వరుడి కుటుంబం పోలీసులను ఆశ్రయించింది.

పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుండగా, సితార తన ప్రియుడు అమన్‌తో కలిసి ఇంట్లో నుంచి పారిపోయింది. ప్రస్తుతం పోలీసులు ఆమె కోసం గాలిస్తున్నారు. ఈ విషయంపై దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. కాగా, సితారకు అమన్ వరుసకు మేనల్లుడు కావడం గమనార్హం. ఇటీవల జరిగిన సోనమ్ ఉదంతం నేపథ్యంలో ఈ ఘటనకు సంబంధించిన కథనం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.



Tags:    

Similar News