Shocking: పేలిపోయిన టాయిలెట్ సీటు.. ఈ కష్టం పగోడీకి కూడా రావద్దు భయ్యా

Update: 2025-05-16 15:07 GMT

Shocking: పేలిపోయిన టాయిలెట్ సీటు.. ఈ కష్టం పగోడీకి కూడా రావద్దు భయ్యా

Shocking: ఈ బిజీ జీవితంలో ప్రశాంతంగా ఉండేది బాత్రూమ్ లోనే అంటూ తరచుగా మనం చాలా జోక్స్ వింటుంటాం. అయితే బాత్రూమ్ కు వెళ్లడం ఓ వ్యక్తికి పీడకలలా మారిపోయింది. అతను కూర్చొన్న టాయిలెట్ సీట్ పేలడంతో అతనికి తీవ్రగాలయ్యాయి యూపీలోని నోయిడాలో జరిగిన ఈ ఘటన వైరల్ గా మారింది. టాయిలెట్ సీటు పేలడం ఏంట్రా అంటూ నెటిజన్లు సైతం షాక్ అవుతున్నారు. అసలేం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.

యూపీలోని నోయిడా సిటీలోని సెక్టార్ 36లో అషు అనే 30ఏళ్ల యువకుడు తన కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు. అయితే ఎప్పటి వలే అషు బాత్రూమ్ కు వెళ్లి టాయిలెట్ సీటు మీద కూర్చొన్నాడు. అయితే ఉన్నట్లుండి అది ఒక్కసారిగా పేలిపోయింది. దీంతో అతనికి గాయాలు అయ్యాయి. వెంటనే కుటుంబ సభ్యులు అతన్ని ఆసుపత్రికి తరలించారు. అయితే బాత్రూమ్ వెళ్లిన సమయంలో ఫోన్ కానీ లేదా మరేదైనా ఎలక్ట్రానిక్ డివైస్ ను వాడలేదని అతని తండ్రి సునీల్ ప్రధాన్ చెబుతున్నారు. బాత్రూమ్ లో పేలుడు ఎలాంటి గాడ్జెట్స్ కారణం కాదని..టాయిలెట్ సీటు మాత్రమే బ్లాస్టర్ అవ్వడం తమకు షాక్ కు గురిచేసినట్లు తెలిపారు.

అయితే ప్రాథమిక సమాచారం ప్రకారం..పేలుడుకు ఎలాంటి విద్యుత్ సమస్య కారణం కాదని..ఆ సమయంలో ఇంట్లో ఏసీ, ప్రతి ఇతర ఎలక్ట్రానిక్ డివైజ్ బాగానే పనిచేస్తున్నాయి. కానీ ఊహించని విధంగా మీథెన్ వాయువు పేరుకుపోవడం వల్లే ఈ పేలుడు సంభవించి ఉండవచ్చని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. టాయిలెట్ సీటు లోపల పేరుకుపోయిన మురుగుకాలువ మూసుకుపోవడం వల్లే ఇలా జరిగి ఉంటుందని భావిస్తున్నారు. ఇలాంటి ప్రమాదాలు ఎక్కడైనా వస్తాయని..ముఖ్యంగా పాతబడిన లేదా సరిగ్గా మెయింటెన్స్ లేని ప్లంబింగ్ సిస్టమ్స్ ఉన్న ఇళ్లలో ఇలాంటి పేలుడులు సంభవిస్తాయని నిపుణులు చెబుతున్నారు. 

Tags:    

Similar News