Parliament: ఉగ్రదాడికి 22 ఏళ్లు పూర్తి.. నివాళులర్పించిన ఉపరాష్ట్రపతి, ప్రధాని, స్పీకర్

Parliament: ఉగ్రదాడిలో అమరులైన భద్రత సిబ్బందికి నివాళి

Update: 2023-12-13 05:39 GMT

Parliament: ఉగ్రదాడికి 22 ఏళ్లు పూర్తి.. నివాళులర్పించిన ఉపరాష్ట్రపతి, ప్రధాని, స్పీకర్

Parliament: పార్లమెంట్‌పై ఉగ్రదాడి జరిగి నేటికి 22 ఏళ్లు పూర్తయింది. పాకిస్థాన్‌కు చెందిన లష్కరే తోయిబా, జైషే మహ్మద్ సంస్థల ఉగ్రవాదులు డిసెంబర్ 13, 2001న పార్లమెంట్ కాంప్లెక్స్‌పై దాడి చేసి తొమ్మిది మందిని చంపారు. మొత్తం ఐదుగురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. ఉగ్రదాడిలో అమరులైన భద్రత సిబ్బందికి పార్లమెంట్‌ వద్ద ఉపరాష్ట్రపతి, ప్రధాని నరేంద్ర మోదీతో పాటు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే,సోనియాగాంధీ, ఇతర నేతలు నివాళులర్పించారు.

Tags:    

Similar News