2000 Notes Exchange: నేడే లాస్ట్ ఛాన్స్.. రూ. 2000 నోట్లను మార్చుకోండి లేదంటే..!
2000 Notes Exchange: మే 19న రూ.2 వేల నోట్లు ఉపసంహరించుకున్న ఆర్‌బీఐ
2000 Notes Exchange: నేడే లాస్ట్ ఛాన్స్.. రూ. 2000 నోట్లను మార్చుకోండి లేదంటే..!
2000 Notes Exchange: రెండు వేల నోట్ల మార్పిడి, బ్యాంకుల్లో డిపాజిట్‌కు ఆర్‌బీఐ విధించిన గడువు నేటితో ముగియనుంది. 2వేల నోట్లను ఉపసంహరిస్తున్నట్లు ఈ ఏడాది మే 19న ఆర్‌బీఐ ప్రకటించింది. ఈ నోట్లను బ్యాంకులో డిపాజిట్ చేయడం లేదా మార్పిడి చేసుకోవాల్సిందిగా సూచించింది. ఈ నెల 1న ఆర్‌బీఐ విడుదల చేసిన ప్రకటనలో 93 శాతం 2వేల నోట్లు మార్కెట్లో నుంచి వెనక్కి వచ్చాయని తెలిపింది. వీటి విలువ 3 లక్షల 32వేల కోట్లని చెప్పింది. ఇంకా 24వేల కోట్ల విలువైన 2వేల నోట్లు వెనక్కి రావాల్సి ఉందని అంచనా వేశారు. వచ్చిన నోట్లలో 87 శాతం డిపాజిట్ల రూపంలో ఉండగా, మిగతా 13 శాతం వరకూ మార్పిడి చేసుకున్నట్లు RBI తెలిపింది.
ఆర్‌బీఐ విధించిన గడువు తీరనున్న నేపథ్యంలో గడువు పెంచుతుందా..? లేదా...? అనేది ఇప్పుడు కీలకంగా మారింది. కొన్ని బ్యాంకుల్లోకి 2వేల నోట్లు రావడం పూర్తిగా ఆగిపోయినట్లు బ్యాంకింగ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ వ్యవధిని అక్టోబరు 31 వరకూ పొడిగించే అవకాశాలున్నాయని రిజర్వ్ RBI వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ప్రవాస భారతీయులను దృష్టిలో పెట్టుకొని ఈ వెసులుబాటు కల్పించే అవకాశం ఉందని తెలుస్తోంది.
ప్రస్తుతం రూ. 2వేల నోటు లీగల్ టెండర్ షరతు కొనసాగుతోంది. ఇలాంటి పరిస్థితిలో రేపటి నుంచి ఆ నోట్లను మార్చుకోవడానికి ఆర్బీఐ కొన్ని చట్టబద్దమైన నియమ నిబంధనలు విధించే అవకాశాలు చాలా ఉన్నాయి. రేపటి నుంచి 2వేల నోటుతో ఎలాంటి లావాదేవీలు జరగవు. అయితే వాటిని బ్యాంకు ఖాతాలో జమ చేసుకోవడానికి అనుమతి ఇచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు. గడువు పెంపుపై చివరి రోజైన ఇవాళ ఆర్‌బీఐ నుంచి స్పష్టత వస్తుందా అనేది చూడాలని అంటున్నారు.