Tik Tok: మళ్లీ టిక్ టాక్ వచ్చోస్తుందోచ్!

Tik Tok: భారత్‌లో తిరిగి వచ్చేందుకు టిక్ టాక్ మాతృసంస్థ బైట్ డాన్స్ భారత్ ఐటీ మంత్రిత్వశాఖను సంప్రదించింది.

Update: 2021-06-27 01:43 GMT

Tik Tok in India

Tik Tok: టిక్ టాక్.. ఎందరో కళాకారులను వెలుగులోకి తెచ్చింది. మరికొందరి పైత్యాన్ని కూడా భరించలేనంతగా చూపించింది. యువత బాగా అడిక్ట్ అయిపోయింది కూడా. చివరకు టిక్ టాక్ లవ్ లు పుట్టుకొచ్చేశాయి... టిక్ టాక్ లేకపోతే సూసైడ్ చేసుకునే రేంజ్ కి దానికి అలవాటుపడిపోయారు. ఇలాంటి యాప్స్ ద్వారా సెక్యూరిటీ ప్రాబ్లెమ్స్ వస్తున్నాయనే కారణంతో భారత్ నిషేధించింది. ఇప్పుడా టిక్ టాక్ మళ్లీ ఎంట్రీ ఇవ్వడానికి తీవ్రంగా ప్రయత్నిస్తోంది. భారత్ తో చర్చలు జరుపుతోంది.

టిక్ టాక్ మళ్లీ ఇండియాలోకి రానుందనే ప్రచారం జరుగుతోంది. భారత్‌లో తిరిగి తమ కార్యకలాపాలను ప్రారంభించే విషయమై భారత ఐటీ మంత్రిత్వశాఖను టిక్ టాక్ మాతృసంస్థ బైట్ డాన్స్ సంప్రదించింది. కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన ఐటీ నిబంధనలను పాటిస్తామని.. టిక్‌టాక్, హలో యాప్‌లను పునరుద్ధరించాలని కోరినట్లు 'ది ప్రింట్' వెబ్‌సైట్ పేర్కొంది.

టిక్ టాక్‌కు భారత ప్రభుత్వం అనుమతి ఇస్తే తిరిగి ఆ సేవలను ప్రారంభిస్తామని ఐటీశాఖ అధికారులకు బైట్ డాన్స్ ప్రతినిధులు విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. యూజర్ల డేటా విషయంలోనూ జాగ్రత్తలు తీసుకుంటామని, కొత్త నిబంధనలను పక్కాగా పాటిస్తామని చెప్పినట్లు సమాచారం.

దేశ ప్రజల భద్రత దృష్ట్యా గత ఏడాది మొత్తం 250 అప్లికేషన్‌లను భారత ప్రభుత్వం నిషేధించింది. ఇందులో ఎక్కువగా చైనీస్ యాప్స్ ఉన్నాయి. నిషేధ సమయం నాటికి భారత్‌లో టిక్ టిక్ టాక్‌కు 20 కోట్ల మంది వినియోగదారులు ఉన్నారు. టిక్‌టాక్‌పై నిషేధం విధించిన తర్వాత లాంటి యాప్స్ చాలా వచ్చాయి. జోష్, మోజ్, చింగారి, ఎంఎక్స్ టకాటక్, మిత్రోన్, జిలి, టికి, రొపోసో, స్నాక్ వీడియో, ఇన్‌స్టా రీల్స్, యూట్యూబ్ షార్ట్స్ వంటి ఎన్నో అప్లికేషన్‌‌లు అందుబాటులో ఉన్నాయి. కానీ ఏవీ టిక్ టాక్ అంత ఆదరణ పొందలేకపోయాయి.

Tags:    

Similar News