Encounter: జమ్ముకశ్మీర్‌ కుల్గాం జిల్లాలో ఎన్‌కౌంటర్‌.. ముగ్గురు ఉగ్రవాదులు హతం

Encounter: బలగాల కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతం

Update: 2023-11-17 05:31 GMT

Encounter: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్ కౌంటర్..8మంది మావోయిస్టులు హతం

Encounter: జమ్మూ కాశ్మీర్‌లో భద్రతా బలగాల యాంటీ టెర్రర్ ఆపరేషన్ కొనసాగుతోంది. దక్షిణ కాశ్మీర్‌లోని కుల్గాం జిల్లా సామ్నులో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఈ ప్రాంతాన్ని అన్ని వైపుల నుంచి భద్రతా బలగాలు చుట్టుముట్టాయి. ఉగ్రవాదులు దాగి ఉన్నారన్న సమాచారంతో... జమ్మూ కాశ్మీర్ పోలీసులు మరియు ఆర్మీ సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహిస్తోంది.సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుండగానే ఉగ్రవాదులు కాల్పులు ప్రారంభించారు. దీంతో అలర్ట్ అయిన భద్రతా దళాలు ఎదురుకాల్పులు ప్రారంభించారు. ఈ కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు.

అంతకుముందు ఉరీ సెక్టార్‌లో ఉగ్రవాదులపై భద్రతా బలగాలు ఆపరేషన్ కలి ప్రారంభించాయి. ఈ ఆపరేషన్ సమయంలో, ఉగ్రవాది బషీర్ అహ్మద్ మాలిక్ మరియు అతని సహచరుడు అహ్మద్ ఘనీ షేక్ మృతి చెందారు. దాదాపు 30 ఏళ్లుగా లోయలో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడిన బషీర్‌ ఎన్‌కౌంటర్‌ను పెద్ద విజయంగా పరిగణిస్తున్నారు.

Tags:    

Similar News