Lok Sabha: లోక్‌సభలో మరో ముగ్గురు ఎంపీల సస్పెన్షన్

Lok Sabha: నిరవధికంగా వాయిదా పడ్డ లోక్‌సభ

Update: 2023-12-21 15:00 GMT

Lok Sabha: లోక్‌సభలో మరో ముగ్గురు ఎంపీల సస్పెన్షన్ 

Lok Sabha: లోక్‌సభలో విపక్ష ఎంపీల సస్పెన్షన్ల పర్వం గురువారం కూడా కొనసాగింది. తాజాగా మరో ముగ్గురు ఎంపీలపై సస్పెన్షన్‌ వేటు పడింది. కాంగ్రెస్‌ పార్టీ కి చెందిన ఎంపీలు దీపక్‌ బైజ్‌, డీకే సురేశ్‌, నకుల్‌ నాథ్‌ అనుచితంగా ప్రవర్తించారంటూ స్పీకర్‌ ఓం బిర్లా వారిపై వేటు వేశారు. ఈ శీతాకాల సమావేశాల మొత్తానికి వీరిని సస్పెండ్‌ చేస్తున్నట్లు తెలిపారు. దీంతో పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ఇప్పటి వరకూ లోక్‌సభ నుంచి సస్పెన్షన్‌కు గురైన ఎంపీల సంఖ్య 100కి చేరింది.

అలాగే, ఉభయ సభల్లో కలిపి ఆ సంఖ్య 146గా ఉంది. మరోవైపు, లోక్‌సభ నిరవధికంగా వాయిదా పడింది. ‘సీఈసీ, ఈసీ’తో పాటు ది ప్రెస్‌ అండ్ రిజిస్ట్రేషన్‌ ఆఫ్‌ పీరియాడికల్స్‌ బిల్లు 2023లకు ఆమోదం తెలిపిన అనంతరం సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా ప్రకటించారు. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్‌ కన్నా ఒకరోజు ముందుగానే లోక్‌సభ సమావేశాలను ముగించారు.

Tags:    

Similar News