LPG Cylinders: ప్రతి కుటుంబానికి 3 సిలిండర్లు ఉచితం.. అక్కడి వారికి మాత్రమే..!

LPG Cylinders: ప్రతి కుటుంబానికి 3 సిలిండర్లు ఉచితం.. అక్కడి వారికి మాత్రమే..!

Update: 2022-03-29 12:30 GMT

LPG Cylinders: ప్రతి కుటుంబానికి 3 సిలిండర్లు ఉచితం.. అక్కడి వారికి మాత్రమే..!

LPG Cylinders: రాష్ట్ర ప్రజలకు గోవా ప్రభుత్వం పెద్ద ప్రకటన చేసింది. కొత్త క్యాబినెట్ మొదటి సమావేశంలోనే మంచి నిర్ణయం తీసుకుంది. బీజేపీ తన ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి మూడు ఎల్‌పిజి సిలిండర్లను ఉచితంగా ఇస్తామని తెలిపింది. కొత్త కేబినెట్ తొలి సమావేశానికి అధ్యక్షత వహించిన ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ఈ విషయాన్ని ప్రకటించారు. ప్రమోద్ సావంత్ క్యాబినెట్‌లో ముఖ్యమంత్రితో పాటు మరో ఎనిమిది మంది మంత్రులు ఉన్నారు.

ఒక ట్వీట్‌లో సీఎం ప్రమోద్ సావంత్ 'ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన తర్వాత మొదటి సమావేశానికి అధ్యక్షత వహించాను. బీజేపీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి మూడు సిలిండర్లు ఉచితంగా అందించేందుకు ప్రణాళిక సిద్ధం చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది'. గత నెలలో గోవాలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ముందు, బిజెపి తన ఎన్నికల మేనిఫెస్టోలో బిజెపి అధికారంలోకి వస్తే రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ప్రతి సంవత్సరం ఉచితంగా మూడు ఎల్‌పిజి సిలిండర్లు ఇస్తామని హామీ ఇచ్చింది.

సిఎం ప్రమోద్ సావంత్ విలేకరులతో మాట్లాడుతూ ప్రస్తుత పదవీకాలంలో ఇనుప ఖనిజం తవ్వకం, ఉపాధి కల్పనను పునఃప్రారంభించడం తన ప్రాధాన్యత అన్నారు. 2019లో అప్పటి ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ మరణానంతరం రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమోద్ సావంత్ బాధ్యతలు చేపట్టడం గమనార్హం. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 40 మంది సభ్యులున్న సభలో ఆ పార్టీ 20 సీట్లను కైవసం చేసుకుంది. సావంత్ నాయకత్వంలో బీజేపీ ఈ ఎన్నికల్లో పోటీ చేసిన విషయం తెలిసిందే.

Tags:    

Similar News