Third Wave: మహారాష్ట్రలో థర్డ్‌ వేవ్ టెన్షన్‌

Third Wave: అహ్మద్‌నగర్ జిల్లాలో 10వేల మంది పిల్లలకు కరోనా

Update: 2021-06-02 13:00 GMT

Representational Image

Third Wave: దేశంలో కరోనా సెకండ్ వేవ్‌ కల్లోలం కొనసాగుతుండగానే థర్డ్ వేవ్‌ టెన్షన్ ప్రకంపనలు రేపుతోంది. మూడో దశలో పిల్లలకే ఎక్కువ ముప్పు ఉంటుందంటూ నిపుణులు హెచ్చరిస్తుండటంతో ప్రజలు భయంతో వణికిపోతున్నారు. అయితే, సెకండ్ వేవ్‌లోనే వేలాది మంది పిల్లలు కరోనా బారిన పడ్డారు. ఒక్క మహారాష్ట్రలోనే పెద్దఎత్తున కేసులు నమోదవుతున్నాయి. అహ్మద్‌నగర్ జిల్లాలో దాదాపు 10వేల మంది పిల్లలకు కరోనా సోకిందంటూ అధికారులు ప్రకటించడం కలకలం రేపుతోంది. కోవిడ్ బారినపడినవారిలో ఎక్కువ మంది పది నుంచి 18ఏళ్లలోపు వాళ్లున్నారని చెబుతున్నారు.

Tags:    

Similar News