దొంగల అతితెలివి : సీసీటీవీ రికార్డు అని సెటప్ బాక్స్ ఎత్తుకెళ్ళారు

Update: 2019-11-12 05:07 GMT

ఇది దొంగల అతితెలివికి పరాకాష్ట అనుకోవాలి. దొంగతనానికి వచ్చిన కొందరు దొంగలు పప్పులో కాలు వేసి అడ్డంగా బుక్కయ్యారు. ఓ నగల షాప్ లో దొంగతనానికి వచ్చిన కొందరు దొంగలు సీసీ రికార్డుకి బదులు టీవీ సెటప్ బాక్స్ ఎత్తుకెళ్ళారు... ఈ సంఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటు చేసుకుంది. ఢిల్లీ లోని బేగంపూర్ లోని నగల షాప్ కి ఓ నలుగురు వ్యక్తులు వచ్చి నగలు కొనే కస్టమర్ లా ప్రవర్తించారు.

ఆ తర్వాత లోపల ఉన్న తూపాకిని బయటకు తీసి యజమానిని బెదిరించారు. షాప్ లో ఉన్న నగలను, డబ్బును లాకున్నారు. అనంతరం అక్కడి నుండి వెళ్తూ తమని ఎవరు గుర్తుపట్టకుండా ఉండేందుకు సీసీ కెమరా రికార్డుకి బదులు పక్కనే ఉన్న టీవీ సెటప్ బాక్స్ ని తీసుకువెళ్ళారు. అనంతరం షాప్ యజమాని పోలీసులుకి ఫిర్యాదు చేసాడు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని సీసీ పుటేజ్ ని పరిశీలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నరు. 

Tags:    

Similar News