Yogi Adityanath: కాంగ్రెస్ హయాంలో విచ్చలవిడిగా అవినీతి జరిగింది
Yogi Adityanath: బీజేపీ హయాంలో అవినీతికి తావు లేదు
Yogi Adityanath: కాంగ్రెస్ హయాంలో విచ్చలవిడిగా అవినీతి జరిగింది
Yogi Adityanath: లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ లక్ష్యంగా బీజేపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. కాంగ్రెస్ హయాంలో విచ్చలవిడి అవినీతి జరిగిందని యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ ఆరోపించారు. యూపీలోని సిద్ధార్ధనగర్‌లో జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ హయాంలో నాటి ప్రధాని రాజీవ్ గాంధీ స్వయంగా అవినీతి గురించి వెల్లడించారని గుర్తుచేశారు. తాము ఖర్చు చేసే ప్రతి రూపాయిలో కేవలం 15 పైసలే ప్రజలకు చేరుతోందని ఆయన అప్పట్లో చెప్పారని తెలిపారు. ఈ రోజు ఆ పరిస్ధితి లేదని, జన్‌ధన్ ఖాతాల్లో నేరుగా డబ్బు ప్రజలకు చేరుతోందని యోగి ఆదిత్యానాథ్ వివరించారు. తాము లక్నోలో కూర్చుని బటన్ నొక్కితే ఆ మరుక్షణమే ప్రజల ఖాతాల్లో డబ్బు జమవుతోందని తెలిపారు.