ఖాతాలో జీరో బ్యాలెన్స్‌ ఉన్నా సరే.. రూ.10,000 విత్‌డ్రా చేయొచ్చు..!

Money Withdraw: మీరు ప్రధానమంత్రి జన్‌ధన్‌ ఖాతా ఓపెన్ చేయకుంటే వెంటనే ఓపెన్ చేయండి...

Update: 2022-04-11 07:45 GMT

ఖాతాలో జీరో బ్యాలెన్స్‌ ఉన్నా సరే.. రూ.10,000 విత్‌డ్రా చేయొచ్చు..!

Money Withdraw: మీరు ప్రధానమంత్రి జన్‌ధన్‌ ఖాతా ఓపెన్ చేయకుంటే వెంటనే ఓపెన్ చేయండి. ఇందులో మీరు ఎటువంటి బ్యాలెన్స్‌ ఉంచనవసరం లేదు. అంతేకాదు ఈ ఖాతా వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఇందులో బ్యాలెన్స్ లేకపోయినా మీరు ఖాతా నుంచి రూ.10,000 వరకు విత్‌డ్రా చేసుకోవచ్చు. ఇది కాకుండా రూపే డెబిట్ కార్డ్ సౌకర్యం కల్పిస్తారు. ఈ డెబిట్‌ కార్డుద్వారా మీరు ఖాతా నుంచి డబ్బు తీసుకోవచ్చు. కొనుగోళ్లు కూడా నిర్వహించవచ్చు.

2014లో స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ జన్ ధన్ యోజనను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. ఆగస్టు 28న ప్రారంభించారు. ఈ పథకం కింద జనవరి 6, 2021 నాటికి మొత్తం జన్ ధన్ ఖాతాల సంఖ్య 41.6 కోట్లకు పెరిగింది. మరిన్ని ఫీచర్లు, ప్రయోజనాలతో ప్రభుత్వం 2018లో ఈ పథకం రెండో సంస్కరణను ప్రారంభించింది. జన్ ధన్ యోజన కింద10 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలపై కూడా ఖాతాను తెరవవచ్చు.

ఈ పథకం కింద ఖాతా తెరిచినప్పుడు మీరు రూపే ATM కార్డ్, రూ.2 లక్షల ప్రమాద బీమా, రూ.30 వేల జీవిత బీమా, డిపాజిట్ మొత్తంపై వడ్డీ పొందుతారు. మీరు దీనిపై 10 వేల ఓవర్‌డ్రాఫ్ట్ సౌకర్యం కూడా పొందుతారు. ఈ ఖాతాను ఏ బ్యాంకులోనైనా తెరవవచ్చు. ఇందులో మినిమమ్ బ్యాలెన్స్ మెయింటెయిన్ చేయాల్సిన అవసరం లేదు. జన్ ధన్ ఖాతాను తెరవడానికి మీరు ఆధార్ కార్డ్, పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్‌ ఏదో ఒకటి ఉండాలి.

మీకు ఈ పత్రాలు లేకపోతే మీరు చిన్న ఖాతాను కూడా ఓపెన్ చేసే సౌకర్యం ఉంది. ఇందులో మీరు బ్యాంకు అధికారి ముందు ఒక ఫోటో, ఫారమ్‌ నింపి సంతకం చేసి ఇవ్వాల్సి ఉంటుంది. జన్ ధన్ ఖాతాను తెరవడానికి మీరు ఎలాంటి రుసుము లేదా ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు.10 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న ఎవరైనా ఈ ఖాతాను తెరవవచ్చు.

Tags:    

Similar News