Punjab: పెట్రోల్ బంకుపై దాడి చేసిన దుండగులు
Punjab: పెట్రోల్ బంక్ సిబ్బందిపై విచక్షణారహితంగా దాడి
Punjab: పెట్రోల్ బంకుపై దాడి చేసిన దుండగులు
Punjab: పంజాబ్‌లోని లూథియానాలో దారుణం చోటుచేసుకుంది. కొంతమంది వ్యక్తులు పెట్రోల్ బంకుపై దాడి చేశారు. బంక్‌ను ధ్వంసం చేసి అక్కడ పని చేసే ఉద్యోగులపై దాడి చేసి విచక్షణారహితంగా కొట్టారు. బంక్‌లోని ఆఫీస్‌పై, పెట్రోల్ యంత్రాలపై రాళ్లతో దాడి చేసి ధ్వంసం చేశారు. అయితే అక్కడ ఉన్న సీసీకెమెరాలో ఈ ఘటన అంతా రికార్డైంది. దీంతో ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 100 సెకన్లపైగా ఉన్న ఆ వీడియోలో పెట్రోల్ బంక్ సిబ్బందిపై వారి దాడి చేయడం స్పష్టంగా కనిపిస్తోంది. అయితే దాడికి గల కారణాలు తెలియాల్సి ఉంది. విషయం పోలీసుల దృష్టికి వెళ్లడంతో నిందితుల కోసం గాలిస్తున్నారు.