Supreme Court: అదానీ - హిండెన్‌బర్గ్ వ్యవహారంలో కేంద్రానికి షాక్..
Supreme Court: కేంద్రం ఇచ్చిన సీల్డ్ కవర్ సూచనలను ఒప్పుకోబోమన్న సుప్రీంకోర్టు
Supreme Court: అదానీ - హిండెన్‌బర్గ్ వ్యవహారంలో కేంద్రానికి షాక్..
Supreme Court: కేంద్ర ప్రభుత్వం సమర్పించిన సీల్డ్ కవర్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. అదానీ స్టాక్ పతనం తర్వాత ఇన్వెస్టర్ల సంపదను సంరక్షించేందుకు పటిష్ట యంత్రాంగం అవసరమని సుప్రీంకోర్టు వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో.. కమిటీ ఏర్పాటుకు కేంద్రం ఓకే చెప్పింది. అయితే ప్యానెల్ వివరాలను కేంద్రం సీల్డ్ కవర్‌లో సమర్పించగా.. సుప్రీంకోర్టు దానిని తిరస్కరించింది. నియంత్రణ చర్యలను బలోపేతం చేయడానికి, పెట్టుబడిదారులను రక్షించడానికి' ఏర్పాటు చేయబోయే ప్యానెల్ వివరాల ప్రతిపాదనలను సీల్డ్ కవర్‌లో ఇవ్వడం సరికాదని... తమకు సీల్డ్ కవర్ అక్కర్లేదని... తాము పూర్తి పారదర్శకతను కోరుకుంటున్నామని తెలిపింది. ఈ సూచనలను అంగీకరిస్తే.. తాము కోరుకోని, ప్రభుత్వం నియమించిన కమిటీగా కనిపిస్తుందని... అది నిర్ణయించుకోవడానికి తమకు వదిలివేయాలని చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతాకు స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలంటూ దాఖలైన పలు పిటిషన్లపై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం.. కమిటీపై తన ఉత్తర్వులను రిజర్వ్‌లో ఉంచింది.