UP Elections: నేడు యూపీలో చివరి దశ పోలింగ్
9 జిల్లాల్లోని 54 నియోజకవర్గాలకు పోలింగ్
UP Elections: నేడు యూపీలో చివరి దశ పోలింగ్
UP Elections: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు క్లయిమాక్స్‌కు చేరుకున్నాయి. ఇవాళ చిట్టచివరి దశ పోలింగ్ జరగనుంది. పూర్వాంచల్‌లో తొమ్మిది జిల్లాల్లోని 54 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఆజంగఢ్, మీర్జాపూర్, మౌవ్, జాన్‌పూర్, ఘాజీపూర్, చన్‌దౌలి, భదోహి, సోన్‌భద్ర జిల్లాలు ఎన్నికలకు సిద్ధమయ్యాయి. మరోవైపు ప్రధాని మోడీ నియోజకవర్గం వారణాసి కూడా పూర్వాంచల్‌లో భాగమే కావడంతో బీజేపీ ఈ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. మార్చి 10న ఫలితాలు వెలువడనున్నాయి.