COVID cases: దేశంలో మరోసారి పడగవిప్పిన కోవిడ్..4వేలకుపైగా యాక్టివ్ కేసులు..!!

Update: 2025-06-02 06:21 GMT

COVID cases: దేశంలో మరోసారి పడగవిప్పిన కోవిడ్..4వేలకుపైగా యాక్టివ్ కేసులు..!!

COVID cases: దేశంలో కోవిడ్ కేసుల సంఖ్య మళ్లీ భారీగా పెరుగుతోంది. ఆదివారం ఒక్క రోజులో దేశవ్యాపత్ంగా 363 కొత్త కోవిడ్ కేసులు నమోదు అయ్యాయని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సోమవారం తెలిపింది. తాజాగా గణాంకాల ప్రకారం భారత్ లో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 3,961కి చేరుకుంది. క్రమంగా కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రజల్లో భయాందోళనలు మొదలవుతున్నాయి. మరోసారి లాక్ డౌన్ తప్పదా అనే సందేహాలు అందరిలోనూ తలెత్తుతున్నాయి.

నిన్న ఒక్కరోజులోనే పశ్చిమ బెంగాల్లో 82 కొత్త కేసులు వెలుగుచూశాయి. ఇది అన్ని రాష్ట్రాల్లో కంటే అధికం. ఆ తర్వాత కేరళలో 64కేసులు, ఢిల్లీలో 61 కేసులు నమోదు అయ్యాయి. ఈ మూడు రాష్ట్రాల్లోని పరిస్థితులపై అధికారులు ప్రత్యేక ఫోకస్ పెట్టారు. ప్రస్తుతం కేరళలో 1400 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇది దేశంలో అత్యధికమని చెప్పవచ్చు. మహారాష్ట్రలో 485కేసులు, ఢిల్లీలో 436, గుజరాత్ లో 320 పశ్చిమ బెంగాల్లో 287కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.

గత 24 గంటల్లో కర్నాటక, కేరళలో ఒక్కొక్కరు కోవిడ్ తో మరణించారు. దేశవ్యాప్తంగా అదే సమయంలో 383 మంది రోగులు కోలుకుని డిశ్చార్జీ అయ్యారు. జనవరి 1, 2025 నుంచి ఇప్పటి వరకు దేశంలో 28 మంది కోవిడ్ తో మరణించారు. అందులో కేరళ, మహారాష్ట్రలో ఏడుగురు, కర్నాటకలో నలుగురు, ఢిల్లీలో ముగ్గురు మరణించారు. మే 29న బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో 63ఏళ్ల వృద్ధుడు కోవిడ్ తో మరణించాడు. మే 21న ఆయన బలహీనతతో ఆసుపత్రిలో చేరారు. చికిత్స పొందుతూ వారం రోజుల్లోనే ప్రాణాలు కోల్పోయారు. ఆ వ్యక్తి పూర్తిగా టీకాలు వేయించుకుని ఉండగా..గతంలో శస్త్ర చికిత్స కీమోథెరపీ, పల్మనరీ ట్యూబర్ కు లోసిస్, బుక్కల్ క్యాన్సర్ వంటి కో మోర్బిడిటీలతో బాధపడుతున్నట్లు వైద్యులు తెలిపారు. 

Tags:    

Similar News