E-Shram Card: కార్మికుల కోసం ఈ శ్రమ్‌ కార్డ్‌.. ప్రయోజనాలు అనేకం..

E-Shram Card: కేంద్ర ప్రభుత్వం కార్మికుల కోసం అనేక పథకాలను ప్రవేశపెడుతోంది.

Update: 2021-12-28 09:56 GMT

 కార్మికుల కోసం ఈ శ్రమ్‌ కార్డ్‌.. ప్రయోజనాలు అనేకం..

E-Shram Card: కేంద్ర ప్రభుత్వం కార్మికుల కోసం అనేక పథకాలను ప్రవేశపెడుతోంది. అందులో భాగంగా ఈ శ్రమ్‌ కార్డుని ప్రవేశపెట్టింది. దీనివల్ల వారికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో ప్రతి కార్మికుడు పేరు నమోదు చేసుకోవాలి. ఈ శ్రమ్‌ కార్డు కింద ప్రభుత్వం ప్రవేశపెట్టే పథకాలన్నిటికి వీరందరు అర్హులు అవుతారు. అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికులకు ఈ-శ్రమ్ కార్డు ద్వారా అన్ని సౌకర్యాలు కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. కానీ మీరు ఈ-శ్రమ్ కార్డ్ కలిగి ఉన్నప్పుడే ఇది జరుగుతుంది. ఈ కార్డు ద్వారా మీరు ప్రభుత్వ పథకాలు, భవిష్యత్తులో ప్రారంభించబోయే పథకాల ప్రయోజనాలను సులభంగా పొందుతారు. ఈ-శ్రమ్ కార్డ్‌ని తయారు చేయడానికి అర్హత ఏంటో తెలుసుకుందాం.

అసంఘటిత కార్మికులు: దేశంలోని పనిచేస్తున్న అసంఘటిత రంగ కార్మికులు ఈ-శ్రమ్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందులో వ్యవసాయ కార్మికులు, వలస కార్మికులు మొదలైనవారు ఉండవచ్చు.ఈ -శ్రమ్ కార్డ్ కోసం 16 నుంచి 59 సంవత్సరాల మధ్య ఉన్న వ్యక్తులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ వయస్సు కంటే ఎక్కువ లేదా అంతకంటే తక్కువ వయస్సు ఉన్న వ్యక్తులు అర్హులు కాదు. కాబట్టి మీరు e-shram కార్డ్‌ని పొందాలని ఆలోచిస్తున్నట్లయితే అర్హతలు తెలుసుకోండి. ఒకే కుటుంబానికి చెందిన చాలా మంది వ్యక్తులు ఇందులో పేర్లు నమోదు చేసుకోవచ్చు.

e-shram పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ కోసం కొన్ని విషయాలను గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం. ఇందులో ముఖ్యమైనది అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికుడు ఆదాయపు పన్ను చెల్లించవద్దు. అంటే, కార్మికుడు పన్ను చెల్లింపుదారు అయితే అతను ఈ-శ్రమ్ పోర్టల్‌లో నమోదు చేసుకోవడానికి అర్హులు కాదు. అక్కడ మాత్రమే కాదు. EPFO, ESIC లేదా NPSలో సభ్యుడు అయి ఉండకూడదు. కేవలం అసంఘటిత రంగ కార్మికులు, ఉద్యోగులు మాత్రమే దీని కిందకు వస్తారు. 

Tags:    

Similar News