Cyber Commandos: ఇక దేశంలో కొత్తగా సైబర్ కమాండోలు
Cyber Commandos: అర్హులైన 10 మంది సైబర్ కమాండోలను గుర్తించాలని ఆదేశం
Cyber Commandos: ఇక దేశంలో కొత్తగా సైబర్ కమాండోలు
Cyber Commandos: సైబర్ దాడుల ముప్పు పెరిగిపోయిన నేపథ్యంలో దేశంలో కొత్తగా సైబర్ కమాండోస్ విభాగాన్ని కేంద్ర సర్కారు ఏర్పాటు చేయనుంది. దీని ద్వారా తదుపరి తరం సైబర్ దాడులకు సన్నద్ధంగా ఉండాలని కేంద్రం భావిస్తుంది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల పోలీసు దళాలు, కేంద్ర పోలీసు బలగాల నుంచి చురుకైన వారిని నియమించుకుని, సైబర్ నైపుణ్యాలు, దాడుల విషయంలో వారిని సుశిక్షితులుగా కేంద్ర హోంశాఖ తీర్చిదిద్దనుంది. అర్హులైన 10 మంది సైబర్ కమాండోలను గుర్తించాలంటూ కేంద్ర పాలిత ప్రాంతాలు, రాష్ట్రాలను కేంద్ర హోంశాఖ తాజాగా కోరింది. ఐటీ సెక్యూరిటీ, డిజిటల్ ఫోరెన్సిక్ విభాగాల్లో సైబర్ కమాండోలు తగినంత పరిజ్ఞానం కలిగి ఉంటారు. సైబర్ కమాండోస్ విభాగం పోలీసుల విభాగాల్లో అంతర్భాగంగా ఉండనుంది.