ప్రభుత్వ కార్యాలయాలపై కేంద్రం కీలక నిర్ణయం

ప్రభుత్వ కార్యాలయాల విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని కార్యాలయాల వద్ద కట్టుదిట్టమైన ఆంక్షలు విధించాలని అధికారులను ఆదేశించింది.

Update: 2020-03-17 15:54 GMT

ప్రభుత్వ కార్యాలయాల విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని కార్యాలయాల వద్ద కట్టుదిట్టమైన ఆంక్షలు విధించాలని అధికారులను ఆదేశించింది. ప్రతి ప్రభుత్వ కార్యాలయం ప్రవేశం వద్ద స్కానర్లు, హ్యాండ్ శానిటైజర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించింది. సమావేశాలు రద్దు చేసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాత్రమే సమీక్ష చేసుకోవాలని సూచించింది. సాధారణ విజిటర్స్ పాసులు రద్దు చేసింది. అధికారులు అనుమతిస్తేనే కార్యాలయాల్లోకి విజిటర్‌ను లోపలికి పంపించాలని ఆదేశించింది.

కరోనా వైరస్ ప్రభావంతో మనదేశం కూడా స్తంభించిపోయింది. ఇప్పటికే స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించారు. షాపింగ్ మాల్స్, బార్లు, జిమ్‌లు వంటి ఎక్కువ మంది గుమిగూడే ప్రాంతాలన్నీ మూతపడ్డాయి. పెళ్లిళ్లు, ప్రభుత్వ కార్యక్రమాలు వాయిదా పడుతున్నాయి. కరోనా బారిన పడకుండా ప్రజలను కాపాడేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. ఇక పలు ప్రైవేట్ సంస్థలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశం ఇచ్చాయి. ఐతే ప్రభుత్వ కార్యాలయాలు మాత్రం యథావిధిగా పనిచేస్తున్నాయి. ఉద్యోగులకు సెలవులు ఇవ్వలేని పరిస్థితి. అలాగని ప్రైవేట్ మాదిరి వర్క్ ఫ్రమ్ హోయ్ చేయదగినిది కాదు. ఈ క్రమంలోనే ప్రభుత్వ కార్యాలయాల విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని కార్యాలయాల వద్ద కట్టుదిట్టమైన ఆంక్షలు విధించాలని అధికారులను ఆదేశించింది.ప్రభుత్వ కార్యాలయాలపై కేంద్రం కీలక నిర్ణయం

Tags:    

Similar News