ఢిల్లీ అసెంబ్లీలో ఆప్ సర్కార్ విశ్వాస పరీక్ష

Delhi: ఆప్‌ ఎమ్మెల్యేలు నిజాయితీ పరులు

Update: 2022-08-30 01:23 GMT

ఢిల్లీ అసెంబ్లీలో ఆప్ సర్కార్ విశ్వాస పరీక్ష  

Delhi: ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ సొంత ప్రభుత్వంపై అసెంబ్లీలో విశ్వాస పరీక్ష ఎదుర్కోనున్నారు. ఆప్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు అవినీతి పేరుతో ఎమ్మెల్యేలను కొనేందుకు బీజేపీ ఆపరేషన్ లోటస్ చేపట్టిందని సీఎం కేజ్రీవాల్‌ ఆరోపించారు. ఆప్ ఎమ్మెల్యేలు కాషాయ పార్టీ ప్రలోభాలకు లొంగరని నిరూపించేందుకు అసెంబ్లీలో విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. ఢిల్లీ అసెంబ్లీలో మొత్తం 70 మంది ఎమ్మెల్యేలకు గాను ఆమ్ ఆద్మీ పార్టీకి 63 మంది సభ్యుల బలం ఉంది. ఇక బీజేపీ సభ్యులు కేవలం ఎనిమిది మంది మాత్రమే ఉన్నారు. కేజ్రీవాల్ సర్కార్ సులభంగా మెజార్టీ నిరూపించుకునే అవకాశం ఉంది.

ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలు పార్టీ మారేందుకు ఒక్కొక్కరి 20 కోట్లు చొప్పు బీజేపీ ఆఫర్ చేసిందని కేజ్రీవాల్ చెప్పారు. మధ్యప్రదేశ్, బీహార్, గోవా, మహారాష్ట్ర, అస్సాం సహా వివిధ రాష్ర్టాల్లో పడగొట్టందుకు ఇప్పటికే 277 మంది ఎమ్మెల్యేలను బీజేపీ కొనుగోలు చేసిందని కేజ్రీవాల్ ఆరోపించారు. ఆప్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయలేదని నిరూపించుకునేందుకే విశ్వాస పరీక్షకు రెడీ అయ్యామని చెప్పారు. ఆపరేషన్ లోటస్ విఫలం అయ్యిందని అన్నారు. మరో వైపు ఢిల్లీలో మధ్యం పాలసీపై సమాధానం చెప్పకుండా ప్రజల దృష్టి మరల్చేందుకే కొత్త అంశాన్ని తెరపైకి తీసుకు వస్తున్నారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. సీబీఐ దర్యాప్తు గురించి వాస్తవాలు చెప్పకుండా ఆమ్ ఆద్మీ పార్టీ డ్రామాలు ఆడుతుందని దుయ్యపట్టారు.

Tags:    

Similar News