Pahalgam Terror Attack: కాశ్మీర్ లో ఉగ్రవేట..టెర్రరిస్టులకు సాయం చేస్తున్న ఇద్దరు అరెస్ట్

Update: 2025-05-06 07:17 GMT

Pahalgam Terror Attack: పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో జమ్మూకశ్మీర్ లో ముష్కరుల కోసం వేట ముమ్మరంగా కొనసాగుతోంది. ఉగ్రవాదుల కోసం భద్రతా సిబ్బంది గాలిస్తున్నారు. ఈ క్రమంలోనే బుద్గాం జిల్లాలో ముష్కరులకు సాయం చేస్తున్న ఇద్దరు సహాయకులను భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి పెద్దెత్తున ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఉగ్రవ్యతిరేక ఆపరేషన్ లో భాగంగా బుద్గాంలో నాన్ చెకింగ్ చేపట్టగా..అనుమానాస్పద కదలికలతో ఉన్న ఇద్దరు వ్యక్తులను భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. వారిని తనిఖీ చేయగా ఆయుధాలు, మందుగుండు సామాగ్రి, పిస్టల్స్, గ్రైనేడ్లు, తూటాలు లభించాయి. దీంతో వారిని అరెస్ట్ చేశారు. వీరు ఉగ్రవాదులకు సాయం చేస్తున్నట్లు దర్యాప్తులో తేలింది.

అన్నిరాష్ట్రాల్లో యుద్ధ అప్రమత్తకు కేంద్రం పిలుపునిచ్చిన నేపథ్యంలో..యుద్ధ సన్నద్దతపై కేంద్ర హోంశాఖ నేడు కీలక సమీక్ష చేపట్టే అవకాశం ఉంది. బుధవారం అన్ని రాష్ట్రాల్లో సివిల్ మాక్ డ్రిల్స్ చేయాలని నిన్న కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. రేపటి మాక్ డ్రిల్స్ ద్రుష్ట్రా పలు రాష్ట్రాల అధికారులతో హోంశాఖ మంగళవారం సమావేశం చేపట్టింది. హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ నేత్రుత్వంలో ఉదయం 10.45 గంటలకు ఈ సమీక్ష జరగనుంది. సుమారు 244 జిల్లాల్లో మాక్ డ్రిల్స్ కు సంబంధించిన ఏర్పాట్లపై సమీక్షించనున్నారు. 

Tags:    

Similar News