Farmers Protest: రైతుల చలో డిల్లీ కార్యక్రమంలో టెన్షన్ టెన్షన్.. పంజాబ్, హర్యానా శంభూ సరిహద్దులో ఉద్రిక్తత
Farmers Protest: పెద్ద ఎత్తున ట్రాక్టర్లలో బయల్దేరిన పంజాబ్ రైతులు
Farmers Protest: రైతుల చలో డిల్లీ కార్యక్రమంలో టెన్షన్ టెన్షన్.. పంజాబ్, హర్యానా శంభూ సరిహద్దులో ఉద్రిక్తత
Farmers Protest: పంజాబ్, హర్యానా శంభూ సరిహద్దులో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. చలో ఢిల్లీకి పిలుపునిచ్చిన రైతులను సరిహద్దుల్లో అడ్డుకునేందుకు పోలీసులు టియర్ గ్యాస్‌ను ప్రయోగించారు. దీంతో అక్కడ టెన్షన్ వాతావరణం క్రియేట్ అయింది. అయితే తమ సమస్యల పరిష్కారానికి రైతులు ఛలో ఢిల్లీకి పిలుపునివ్వడంతో.. ఢిల్లీ పోలీసులు ఎక్కడికక్కడ రహదారులన్నిటినీ మూసివేశారు. దేశ రాజధానిని ఇప్పటికే పోలీసులు అష్టదిగ్బంధనం చేశారు. డిమాండ్ల సాధనకు దేశ రాజధానిలో నిరసనకు సిద్ధమైన అన్నదాతల్ని పోలీసులను అడ్డుకుంటున్నారు. ఉదయం నుంచే బారికేడ్లతో ఎక్కడికక్కడ సరిహద్దుల వద్ద నిలబడ్డారు. దీంతో అంతటా ఉద్రిక్త వాతావరణం నెలకొంది.