Ayodhya: అయోధ్యలో భారీగా పడిపోయిన ఉష్ణోగ్రతలు

Ayodhya: హీటర్ల ఏర్పాటుపై ఆనందం వ్యక్తం చేస్తున్న భక్తులు

Update: 2024-01-16 07:34 GMT

Ayodhya: అయోధ్యలో భారీగా పడిపోయిన ఉష్ణోగ్రతలు

Ayodhya: ఉత్తర భారతాన్ని చలిపులి వణికిస్తోంది. అయోధ్యలో రామాలయం ప్రారంబోత్సవం.. బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్టకు దేశం నలుమూల నుంచి రామజన్మభూమికి భారీగా తరలివస్తున్న భక్తులు చలికి ఇబ్బంది పడుతున్నారు.. దీంతో అయోధ్యలో ఉష్టాగ్రతలు భారీగా పడిపోవడంతో అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయోధ్యలో భక్తులను చలినుంచి కాపాడేందుకు ఆలయ పరిసరాల్లో హీటర్లు ఏర్పాటు చేశారు. ఆలయ నిర్వాహకులు ఏర్పాటు చేసిన హీటర్లు కొత్త తరహాలో ఉన్నాయి. విద్యుత్‌ పోల్‌ మాదిరిగా ఉండే స్తంభానికి పైభాగంలో ఎలక్ట్రిసిటీ ఫిలమెంట్ వేడికావడంతో ఉత్పన్నమయ్యే వేడి పరిసరాల్లోని ఉష్ణోగ్రతలు పెంచుతోంది. భక్తులు, సెక్యూరిటీ సిబ్బంది హీటర్ల కిందికి చేరి చలి కాచుకుంటున్నారు.. హీటర్ల ఏర్పాటుపై భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News