టీవీ వినియోగదారులకు ట్రాయ్ శుభవార్త
వినియోగదారులకు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ(ట్రాయ్) భారీ శుభవార్త అందించింది. ఇప్పటి వరకు కొనసాగుతున్న బేసిక్ ప్యాక్, అలాకార్ట్ లను రద్దు చేసింది.
వినియోగదారులకు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ(ట్రాయ్) భారీ శుభవార్త అందించింది. ఇప్పటి వరకు కొనసాగుతున్న బేసిక్ ప్యాక్, అలాకార్ట్ లను రద్దు చేసింది. ఇకనుంచి కేవలం 130 రూపాయలు చెల్లించిన వారికి 200 ఫ్రీ టు ఎయిర్ ఛానల్స్ ఇవ్వాలని ట్రాయ్ ఆదేశించింది. గతంలో అయితే 130 రూపాయలు చెల్లిస్తే కేవలం 100 ఫ్రీ ఛానల్స్ మాత్రమే వచ్చేవి. వీటితో పాటు.. మరో 26 దూరదర్శన్ ఛానల్స్‌ను కూడా కేబుల్ ఆపరేటర్స్ తప్పనిసరిగా ఇవ్వాల్సి ఉంటుంది. అయితే దీనికి కూడా మరో 30 రూపాయల దాకా తీసుకుంటున్నారు. అయితే తాజాగా ట్రాయ్ నిబంధనల ప్రకారం 200 ఛానెళ్లను గరిష్టంగా రూ .130 (పన్నులు మినహాయించి) ఎన్‌సిఎఫ్ (నెట్వర్క్ కెపాసిటీ ఫీ) కే అందించాలని ట్రాయ్ చెప్పింది.
దానికి తోడు, సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ తప్పనిసరి అని ప్రకటించిన ఛానెల్‌లను ఎన్‌సిఎఫ్‌లోకి తీసుకురావొద్దని పేర్కొంది. అన్ని ఫ్రీ టు ఎయిర్ ఛానెల్‌లను తమ ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులో ఉంచినందుకు నెలకు రూ .160 కంటే ఎక్కువ వసూలు చేయవద్దని ఆపరేటర్లకు ట్రాయ్ ఆదేశించింది. అంటే 160 రూపాయలు చెల్లిస్తే అన్ని ఫ్రీ టు ఎయిర్ ఛానల్స్ ఇవ్వాల్సిందే అన్నమాట. ప్రస్తుతం, ఆపరేటర్లు మొదటి 100 ఛానెళ్లకు రూ .153 ఎన్‌సిఎఫ్ ఛార్జీలు, ప్రతి 25 అదనపు ఛానెళ్లకు రూ .20 (పన్నులు మినహాయించి) వసూలు చేస్తున్నారు. తాజా నిర్ణయంతో 130 రూపాయలు చెల్లించిన వారికి 200 ఫ్రీ టు ఎయిర్ ఛానల్స్ అలాగే రూ.160 చెల్లిస్తే ఫ్రీ టు ఎయిర్ ఛానల్స్ అన్ని కూడా రానున్నాయి. మార్చి 1, 2020 నుంచి న్యూ టారిఫ్ ఆర్డర్ సవరణలు అమల్లోకి వస్తాయని ట్రాయ్ పేర్కొంది.