West Bengal Elections: తెరపైకి మరో కూటమి
West Bengal Assembly Elections 2021: రానున్న ఎన్నికల్లో టీఎంసీతో జతకట్టేందుకు ఆర్‌జేడీ సిద్ధమయింది.
Mamata Banerjee, RJD Tejashwi Yadav (ఫోటో హన్స్ ఇండియా)
West Bengal Assembly Elections 2021: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ పశ్చిమబెంగాల్‌లో మరో కూటమి తెరపైకి వచ్చింది. రానున్న ఎన్నికల్లో టీఎంసీతో జతకట్టేందుకు ఆర్‌జేడీ సిద్ధమయింది. అసెంబ్లీ ఎన్నికల్లో దీదీకి తమ పూర్తి మద్దతు ఉంటుందని RJD నేత తేజస్వి యాదవ్ ప్రకటించారు. మమతా బెనర్జీని ..తేజస్వి యాదవ్ రాష్ట్ర సెక్రటేరియట్‌లో కలుసుకుని మంతనాలు సాగించారు.
ఇప్పటికే ఆర్జేడీ నేత అబ్దుల్ బారి సిద్ధిఖి సారథ్యంలోని పార్టీ ప్రతినిధి బృందం టీఎంసీ సీనియర్ నేత, మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీతో పలు రౌండ్లు చర్చలు జరిపింది. పశ్చిమ బెంగాల్ లో బీజేపీని ఓడించడమే ఆర్జేడీ ధ్యేయమని తేజస్వి యాదవ్ వెల్లడించారు. ఈమేరకు దీదీతో కలిసి ముందుకు సాగుతామని ప్రకటించారు.