Madras Eye: తమిళనాడును వణికిస్తున్న మద్రాస్‌ ఐ.. ఒక్కో ఆస్పత్రిలో రోజుకు 200 నుంచి 250 మంది రోగులు

Madras Eye: గవర్నమెంట్‌ హాస్పిటల్‌కు క్యూకడుతున్న మద్రాస్ ఐ బాధితులు

Update: 2022-11-21 07:23 GMT

Madras Eye: తమిళనాడును వణికిస్తున్న మద్రాస్‌ ఐ.. ఒక్కో ఆస్పత్రిలో రోజుకు 200 నుంచి 250 మంది రోగులు

Madras Eye: సాధారణంగా శీతాకాలంలో వచ్చే కళ్లకలక తమిళనాడును వణికిస్తోంది. దీనిని మద్రాస్‌ ఐగా కూడా పిలుస్తారు. ఇది మధురై నగరంలో మరీ ఎక్కువగా ఉంది. రాజాజీ గవర్నమెంట్‌ హాస్పిటల్‌లో గంటకు 25 నుంచి 30మంది రోగులు చేరుతున్నారు. పిల్లల నుంచి పెద్దల వరకు ఇది చాలా సులువుగా సోకుతుందని.. ముందు జాగ్రత్తలతో దీనిని కొంతవరకు అరికట్టవచ్చు అంటున్నారు వైద్యులు. ఈ వైరస్‌ సోకిన వారి కళ్లలో మందుగా దురద పుడుతుందని.. కళ్లను రుద్దుకోవడం వల్ల ఎర్రగా మారి కళ్లు విపరీతంగా మండుతాయి. ఈ లక్షణాలు కనిపిస్తే వైద్యుడిని సంప్రదించాలి. కళ్ళకలక ఈ సీజన్‌లో వచ్చే సాధారణ వైరసే అయినా ఈ సారి రాష్ట్రమంతటా ఒక్కో ఆస్పత్రిలో రోజుకు 200 నుంచి 250 మంది రోగులు చేరడం ప్రభుత్వాన్ని కూడా కలవరానికి గురిచేస్తోంది.

Full View
Tags:    

Similar News