MK Stalin: సిటీ బస్సు ఎక్కిన సీఎం..

MK Stalin: ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి సంచలన నిర్ణయాలు తీసుకుంటూ..

Update: 2021-10-23 15:43 GMT

MK Stalin: సిటీ బస్సు ఎక్కిన సీఎం..

MK Stalin: ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి సంచలన నిర్ణయాలు తీసుకుంటూ వార్తల్లో నిలుస్తున్న తమిళనాడు సీఎం స్టాలిన్ తాజాగా బస్సులో ప్రయాణించి అందర్నీ ఆశ్చర్యపరిచారు. రాష్ట్రంలో టీకా పంపిణీ కార్యక్రమాన్ని పరిశీలించేందుకు చెన్నైలోని కన్నాగి ప్రాంతంలోని ఓ వ్యాక్సిన్ కేంద్రానికి వెళ్లారు స్టాలిన్.

అక్కడ ఆరోగ్య సిబ్బంది, టీకా తీసుకునే వారితో మాట్లాడి తిరుగు పయనమయ్యారు. ఆ సమయంలో అటుగా వెళ్తున్న ఓ బస్సెక్కారు. ఈ అనూహ్య పరిణామంతో బస్సులోని డ్రైవర్, కండక్టర్, ప్రయాణికులు ఆశ్చర్యానికి లోనయ్యారు. సీఎం స్టాలిన్‌తో ఫోటోలు, వీడియోలు తీసుకున్నారు. బస్సులు సకాలంలో వస్తున్నాయా సౌకర్యాలు ఎలా ఉన్నాయని ప్రజలను అడిగి తెలుసుకున్నారు స్టాలిన్.

Tags:    

Similar News