Tamil Nadu: పొలిటికల్ హీట్.. గెలుపు గుర్రాలను ప్రకటించిన పార్టీలు

Tamil Nadu: తమిళనాడులో పాలిటిక్స్ హీటెక్కాయి. పార్టీల పొత్తుల పంచాయతీలు కొలిక్కి వచ్చేశాయి.

Update: 2021-03-13 02:28 GMT

తమిళ్ పార్టీలు (ఇమేజ్ సోర్స్ TheHansIndia)

Tamil Nadu: తమిళనాడులో పాలిటిక్స్ హీటెక్కాయి. పార్టీల పొత్తుల పంచాయతీలు కొలిక్కి వచ్చేశాయి. ఇక ఇప్పుడు అన్ని అభ్యర్థులపై దృష్టాసారించాయి. కొన్ని పార్టీలు ఇప్పటికే గెలుపు గుర్రాలను ప్రకటించాయి. కొన్ని పార్టీలైతే ఏకంగా నామినేషన్లు కూడా దాఖలు చేశాయి.

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల తేదీ సమీపిస్తోంది. అన్ని పార్టీలు అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. డీఎంకే సైతం తమ గెలుపు గుర్రాలను ప్రకటించింది. 173 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను ఆ పార్టీ అధినేత స్టాలిన్ విడుదల చేశారు. ఎంకే స్టాలిన్ కోలాతూర్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీచేస్తున్నారు. ఆయన కుమారుడు, సినీ నటుడు ఉదయనిధి స్టాలిన్ చెన్నైలోని చెపాక్ నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్నట్లు వెల్లడించారు.

కమల్ పార్టీ మక్కల్‌ నీది మయ్యం రెండో జాబితాను విడుదల చేసింది. M.N.M చీఫ్ కమల్‌హాసన్ కోయంబత్తూరు సౌత్ నియోజకవర్గం నుంచి ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. ప్రజలు తనను తప్పకుండా గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు. 154 స్థానాల్లో ఎంఎన్ఎం పోటీ చేయనుంది.

అధికార పార్టీ అన్నాడీఎంకే తొలి జాబితాను విడుదల చేసింది. తొలిజాబితాలో ఆరుగురి పేర్లు ఖరారు చేసింది. ఏఐడీఏంకే తొలిజాబితాలో హేమాహేమీలు బరిలో నిలిచారు. ఎడప్పాడి నుంచి ముఖ్యమంత్రి పళనిస్వామి బరిలో నిలువగా.. బోధినాయకనూర్ నుంచి డిప్యూటీ సీఎం పన్నీర్‌ సెల్వం పోటీకి దిగారు. వీరు నామినేషన్లు కూడా దాఖలు చేశారు. మొత్తం 234 స్థానాలున్న తమిళనాడు అసెంబ్లీకి ఒకే విడతలో ఏప్రిల్ 6న ఎన్నికలు జరగనున్నాయి. మే 2న ఫలితాలు వెల్లడికానున్నాయి.

Tags:    

Similar News