Tamannaah Bhatia: మైసూర్ పాక్ లాగానే మైసూర్ శాండిల్ సోప్ అంటూ తమన్నాపై సోషల్ మీడియాలో రచ్చ రచ్చ

Update: 2025-05-23 01:26 GMT

Tamannaah Bhatia: మైసూర్ పాక్ లాగానే మైసూర్ శాండిల్ సోప్ అంటూ తమన్నాపై సోషల్ మీడియాలో రచ్చ రచ్చ

Tamannaah Bhatia: మైసూర్ శాండల్ సోప్ బ్రాండ్ అంబాసిడర్ గా ప్రముఖ నటి తమన్నా ఎంపికయ్యారు. ఈ మేరకు కర్నాటక ప్రభుత్వం ఈ నిర్ణయ తీసుకుంది. రెండేళ్ల కాలానికి రూ. 6.2కోట్లు చెల్లించేలా ప్రభుత్వ రంగ సంస్థ కర్నాటక సోప్స్ అండ్ డిటర్జెంట్స్ లిమిటెడ్ సంస్థతో ఆమె ఒప్పందం కుదుర్చుకుంది. మైసూర్ శాండల్ సోప్ తోపాటు ఆ సంస్థకు చెందిన ఇతర ఉత్పత్తులకు కూడా ఆమె ప్రకటనలు చేయనున్నారు. అయితే ఇక్కడే తమన్నా వివాదంలో చిక్కుకుంది. కర్నాటకలో ఎంతో మంది టాలెంటెడ్ వ్యక్తులు ఉన్నా ఏరి కోరి ఇతర రాష్ట్రానికి చెందిన తమన్నానే ఎందుకు ఎంచుకున్నారంటూ సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వ నిర్ణయాన్ని పలువురు నెటిజన్లు తప్పుబడుతున్నారు.

మైసూర్ రాజు క్రిష్ణరాజ్ వడియార్ 4 మైసూర్ శాండర్ సోప్ సంస్థను 1900లో బెంగళూరులో స్థాపించారు. 1916లో సబ్బుల తయారీని వేగవంతం చేసిన ఈ సంస్థ..కేవలం కర్నాటకలోనే కాకుండా దక్షిణ భారతదేశంలో ఎంతో పేరు సంపాదించుకుంది. క్రమంగా కర్నాటకకు కేరాఫ్ అడ్రాస్ గా మారింది. అలాంటి ప్రఖ్యాత కంపెనీకి తాజాగా తమన్నా బ్రాండ్ అంబాసిడర్ ఎంపికయ్యింది. ఇది ఆమె కెరీర్ లో ఓ మైలు రాయి అనే చెప్పాలి. ఇప్పటికే ఎన్నో ప్రకటనల్లో నటించినప్పటికీ ఇది మాత్రం కచ్చితంగా ప్రత్యకమే అనవచ్చు.

మైసూర్ శాండర్ సోప్ బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపికైనా తమన్నాను..సోషల్ మీడియాల వేదికగా అభినందించే వారు కొందరు అయితే..మరికొంత మంది మాత్రం అటు ప్రభుత్వాన్ని ఇటు ఆమెపైనా విమర్శలు చేస్తున్నారు. కర్నాటకలో చాలా మంది టాలెంటెడ్ వ్యక్తులు ఉండగా..ఇతర రాష్ట్రానికి చెందిన ఆమెను ప్రకటన కర్తగా ఎలా ఎంపిక చేశారంటూ ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయం కన్నడ ప్రజల మనోభావాలను దెబ్బతీసిందని విమర్శిస్తున్నారు. దీనిపై కర్నాటక వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి ఎంబీ పాటిల్ స్పందించారు. ఈ సబ్చులకు కర్నాటకలో ఇప్పటికే మంచి డిమాండ్ ఉందని..ఈ ఉత్పత్తిని దేశవ్యాప్తంగా విస్తరించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని వివరణ ఇచ్చారు. అయితే ఈ వివాదంపై ఇప్పటి వరకు తమన్నా స్పందించలేదు. 

Tags:    

Similar News